https://oktelugu.com/

తెలంగాణలో ‘వైసీపీ-షర్మిల’కు సాధ్యమేనా?

వైఎస్సార్ సీపీ.. దివంగత వైఎస్సార్ మరణం అనంతరం ఎన్నో ఆటుపోట్లు.. రాజకీయ కుట్రలను ఎదుర్కొన్న పార్టీ ఇదీ.. హెలీకాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం వెలిసిన పార్టీ వైసీపీ. 2011 మార్చి12 వ తేదీన వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీని స్థాపించారు. పార్టీ అవతరించిన తరువాత మొదటి ఐదేళ్లు కుట్రలు.. కాంగ్రెస్ అధిష్టానం కుతంత్రాలతో జగన్ మెహన్ రెడ్డి ఎన్నో కష్టాలు అనుభవించాడు. జైలు జీవితం గడిపాడు. కష్టపడి సంపాదించిన ఆస్తులను […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2021 / 01:15 PM IST
    Follow us on

    వైఎస్సార్ సీపీ.. దివంగత వైఎస్సార్ మరణం అనంతరం ఎన్నో ఆటుపోట్లు.. రాజకీయ కుట్రలను ఎదుర్కొన్న పార్టీ ఇదీ.. హెలీకాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం వెలిసిన పార్టీ వైసీపీ. 2011 మార్చి12 వ తేదీన వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీని స్థాపించారు. పార్టీ అవతరించిన తరువాత మొదటి ఐదేళ్లు కుట్రలు.. కాంగ్రెస్ అధిష్టానం కుతంత్రాలతో జగన్ మెహన్ రెడ్డి ఎన్నో కష్టాలు అనుభవించాడు. జైలు జీవితం గడిపాడు. కష్టపడి సంపాదించిన ఆస్తులను ఈడీ ఆక్రమించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికష్టాలు ఎదురైనా పార్టీని నిలబెట్టాడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.

    రాష్ట్రం విడిపోయిన తరువాత.. చంద్రబాబు బీజేపీ జనసేనతో కలిసి అధికారం సొంతం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. వైసీపీ నుంచి గెలిచిన వారిని తమ పార్టీలోకి తీసుకున్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు… 18 మందికి పైగా ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నాడు. అయినా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సంయమనం పాటించారు. తరువాత ఆ కేసు.. ఈ కేసు .. అంటూ జైలుకు పంపించాలని చూశారు. అయినా జగన్ భయపడలేదు. అన్నింటిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓ వైపు జగన్ ను ఇబ్బందుల పాలు చేస్తూనే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచాడు. ఈ క్రమంలో జగన్ మెహన్ రెడ్డి.. పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ మెహన్ రెడ్డి.. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రజల శ్రేయ్సస్సే లక్ష్యంగా పని చేస్తున్నారు. అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మాటిచ్చిన పథకాలతో పాటు.. హామీ ఇవ్వనివి కూడా తీరుస్తున్నారు. రెండేళ్ల పరిపాలనలో మంచి పేరు సంపాదించారు. ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ జగన్ మోహన్ రెడ్డి అంటే ఓ ప్రత్యేకతను అభిమానాన్ని సంపాదించుకున్నారు.

    వైఎస్సార్ ఉన్న సమయంలోనే ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు.. అందించిన సాయం.. పరిపాలనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది రైతులు.. మహిళలు.. విద్యార్థులు ముగ్దులయ్యారు. ఆయన మరణ అనంతరం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ విడిపోయింది. అయినా వైఎస్సార్ అంటే అభిమానం ప్రతీ వ్యక్తి గుండెల్లోనూ ఉంది. రాజన్న రాజ్యం ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ కావాలని ఎంతో మంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే జగనన్న ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో చాలా మంది కీలక రాజకీయ నేతలకు చెక్ పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

    ఏపీలో సువర్ణ పాలన అందిస్తున్న జగన్ తెలంగాణ ప్రజలకు సైతం తనేంటో తెలపాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో.. తెలంగాణలోనూ రాజన్న రాజ్యం ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ మరణం తరువాత జగన్ కు తోడుగా ఉండి.. నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల మనసును గెలుచుకున్న షర్మిలమ్మ.. త్వరలో తెలంగాణలో వైసీపీ బాధ్యతలు తీసుకోబోతుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని నిన్న ఖండించిన షర్మిలా వార్తను ప్రచారం చేసిన పత్రికాధినేతను తిట్టింది కానీ.. తెలంగాణలో పార్టీ విషయంపై మాత్రం నోరెత్త లేదు. ఈ విషయమై కార్యకర్తలతోనూ సమీక్షించినట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునే దిశగా బీజేపీకి, కాంగ్రెస్ ప్రత్యామ్మాయంగా నిలబడాలన్న ఆలోచలనలో ఉందని..అయితే దానికి సమయం ఉందని అంటున్నారు.

    త్వరలో కేటీఆర్ ను సీఎం కుర్చీ ఎక్కించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీలో ఉన్న వ్యతిరేకత.. ముఖ్యనాయకుల తిరుగుబాటును క్యాష్ చేసుకోవాలని చూస్తుంది వైసీపీ. ఇదే మంచి సమయం అన్నట్లుగా.. ఫిబ్రవరి 18 కన్నా ముందే.. ఫిబ్రవరి 9నే షర్మిలమ్మకు తెలంగాణ వైసీపీ పగ్గాల అప్పగించే అవకాశాలు మెండుగా కపినిస్తున్నాయి. అయితే ఆమె ఖండించినా కానీ వైసీపీ వర్గాల్లో మాత్రం దీనిపైనే చర్చ జరుగుతోంది.కానీ సెంటిమెంట్స్ కు తావు లేని తెలంగాణలో వైసీపీకి, షర్మిల పార్టీ మనుగడ కష్టమేనని మేధావులు, నిపుణులు అంటున్నారు.