విజయకాంత్ సార్ కి వణక్కం అంటున్న పవన్ కళ్యాణ్

కరోనా వైరస్ ఒక పక్క మనుషులను హడలెత్తిస్తున్నప్పటికీ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తోంది . మనిషిలో దాగిన మానవత్వాన్ని తట్టి లేపుతోంది. ప్రాణం పోయే వేళ ఈ ఐశ్వర్యం , సంపద అంతా వృధా, ఎందుకూ కోరగాదన్న సత్యాన్ని గుర్తు చేసింది. కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా? ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోలీవుడ్ స్టార్ హీరో , డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కరోనా బాధితుల కోసం ఒక సాహసోపేత […]

Written By: admin, Updated On : April 23, 2020 5:55 pm
Follow us on


కరోనా వైరస్ ఒక పక్క మనుషులను హడలెత్తిస్తున్నప్పటికీ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తోంది . మనిషిలో దాగిన మానవత్వాన్ని తట్టి లేపుతోంది. ప్రాణం పోయే వేళ ఈ ఐశ్వర్యం , సంపద అంతా వృధా, ఎందుకూ కోరగాదన్న సత్యాన్ని గుర్తు చేసింది.

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోలీవుడ్ స్టార్ హీరో , డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కరోనా బాధితుల కోసం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది . కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేసేందుకు ఎపుడూ ముందుకు వచ్చే విజయకాంత్ . ఇప్పుడు కరోనా ఆపత్కాలం లో కూడా ఒక అడుగు ముందుకేశాడు. కరోనా వైరస్ తో చనిపోయిన వారికి తనకు సంబంధించిన సొంత కాలేజీ స్థలాన్ని ఖనానికి ఇస్తున్నట్టు ప్రకటించాడు . ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణముంది. ఈ మధ్య కరోనాపై పోరాడిన డాక్టర్ అదే కరోనాతో చనిపోతే గ్రామస్థులు అడ్డుకుని అంబులెన్స్ పై దాడి కూడా చేశారు. ఆ దుస్థితి గమనించిన విజయ్ కాంత్ తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాలలో కరోనా శవాలను ఖననం చేసుకోవచ్చని. అభయమిచ్చాడు .దాంతో కోలీవుడ్ మొదలుకుని.. టాలీవుడ్ వరకూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వలస కూలీల పెద్ద మనసుకి హాట్సాప్!

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్పందనని తెలియ జేస్తూ ‘ విజయ్ కాంత్ గారూ.. మీరు చేసిన మంచిపనిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు వణక్కం .’ అని పొగడ్డం జరిగింది.