దొడ్డిదోవన భారత్ మార్కెట్ లోకి ఫేస్‌బుక్‌!

రిలయన్స్, ఫేస్‌బుక్‌ల మధ్య కుదిరిన భారీ డీల్ భారత దేశంలో సంచలనం కలిగిస్తున్నది. ఈ డీల్ విలువ దాదాపు రూ 43,000 కోట్లు అని చెబుతున్నారు. రిలయన్స్ ఆధ్యర్యంలోని జియో మార్ట్, ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్స‌ాప్ కలసి పనిచేసేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. 2014 తరువాత ఫేస్‌బుక్ కుదుర్చుకున్న అతి పెద్ద ఒప్పందం ఇదే. దీన్ని బట్టి సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ పెట్టుబడికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో ఇట్టే అర్థం చేసుకుకోవచ్చు. […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 12:02 pm
Follow us on


రిలయన్స్, ఫేస్‌బుక్‌ల మధ్య కుదిరిన భారీ డీల్ భారత దేశంలో సంచలనం కలిగిస్తున్నది. ఈ డీల్ విలువ దాదాపు రూ 43,000 కోట్లు అని చెబుతున్నారు. రిలయన్స్ ఆధ్యర్యంలోని జియో మార్ట్, ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్స‌ాప్ కలసి పనిచేసేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.

2014 తరువాత ఫేస్‌బుక్ కుదుర్చుకున్న అతి పెద్ద ఒప్పందం ఇదే. దీన్ని బట్టి సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ పెట్టుబడికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో ఇట్టే అర్థం చేసుకుకోవచ్చు. దీని వల్ల ఫేస్‌బుక్ భారత ఈ-మార్కెట్లో మరింత విస్తరించేందుకు అవకాశం లభిస్తున్నది.

ప్రపంచంలోనే చైనా తరువాత భారతే అతి పెద్ద మార్కెట్. యువ జనభా అధికంగా ఉన్న భారత్‌లో ఆన్‌లైన్‌లో జరిగే కొనుగోళ్లు, చెల్లింపులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. భారత మార్కెట్లో వేళ్లునుకునేందుకు ఫేస్‌బుక్‌కు తాజాగా ఈ ఒప్పందం రూపంలో మంచి అవకాశం లభించినట్లయింది.

భారత్ లో అత్యంత ధనవంతుడి కాకుండా రాజకీయంగా విశేషమైన పలుకుబడి గల రిలయన్స్ తో ఒప్పందం ద్వారా, వారి సహకారంతో వాట్సాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఫేస్‌బుక్ భారత్‌లో ఇప్పుడు ప్రవేశ పెట్టె ప్రయత్నం చేయనున్నది.

ఇప్పటి వరకు సమాచార భద్రత దృష్ట్యా ప్రభుత్వం అనుమతులు పొందటం ఫేస్‌బుక్‌కు సాధ్యం కావడం లేదు. పైగా, వాట్స్ అప్ వ్యవహార శైలి పట్ల భారత్ లోని భద్రతా వర్గాలు పలు సందర్భాలలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. పైగా విదేశీ ఆధారిత సోషల్ మీడియా సంస్థలు భారత్ వ్యతిరేక ప్రచారాలకు కేంద్రంగా ఉండడం కూడా భారత దేశంలో కలకలం రేపుతున్నది.

వాట్స్ ఆప్ వ్యవహారాలలో కొన్ని నియంత్రణలు తీసుకు రావడం కోసం భారత్ ప్రయత్నం చేస్తున్నది. అటువంటి ప్రయత్నాలను ఫేస్‌బుక్ ప్రతిఘటిస్తూ వస్తున్నది.

ఇప్పుడు రిలయన్స్ సహాయంతో భారత ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులను తేలికంగా పొందవచ్చని ఫేస్‌బుక్ భావిస్తున్నట్లు వెల్లడి వాడుతున్నది. ఒక విధంగా నేరుగా భారత్ మార్కెట్ లో ఆధిపత్యంకోసం ప్రభుత్వ పరంగా ఎదురవవుతున్న ఆటంకాలను అధిగమించడం కోసం రిలయన్స్ ద్వారా దొడ్డిదోవన ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పవచ్చు.

మరోవంక, వాట్సాప్, జియోమార్ట్‌ల కలయిక ద్వారా ఖాతాదారులు, వ్యాపారులను అనుసంధానం చేయడం సులభం కానుంది. ఇది ఇరు కంపెనీలకు భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువుగా ఉండే అవకాశం రాగలదని భావిస్తున్నారు.

టెక్నాలజీ రంగంలో మేటి అయిన ఫేస్‌బుక్‌తో ఒప్పందం రిలయన్స్‌కు కూడా కొత్త అవకాశాల్ని తెచ్చిపెట్టగలదని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అల్లాడిపోతున్న రిలయన్స్ సంస్థ‌లకు ఈ డీల్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సంస్థ నికర అప్పులను తగ్గిస్తానంటూ మదుపర్లకు హామీ ఇచ్చిన ముఖేశ్ అంబానీకి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.