https://oktelugu.com/

RRR: ముంబయి విమానాశ్రయంలో రామ్​చరణ్​.. ఆర్​ఆర్​ఆర్​ మెగా ఈవెంట్​కు సర్వం సిద్ధం

RRR: బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్​. ఈ సినిమాలో తారక్​, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 10:23 AM IST
    Follow us on

    RRR: బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్​. ఈ సినిమాలో తారక్​, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్​ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. యాక్షన్స్​, ఎమోషన్స్​, ఎలివేషన్స్​ ఇలా అన్నింట్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ట్రైలర్​.

    RRR

    Also Read: సెట్స్​లో నాగ్​ ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూసేవాళ్లం- అలియా

    ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్​లో వేగం పెంచారు రాజమౌళి. తాజాగా ముంబయిలో జరగనున్న ఆర్​ఆర్​ఆర్​ మెగా ఈవెంట్​ కోసం రామ్​చరణ్​, రాజమౌళి ముంబయికి చేరుకున్నారు. తాజాగా ముంబయి విమానాశ్రయంలో అడుగుపెట్టిన చెర్రీ.. ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. లెదల్​ జాకెట్​తో, సన్​ గ్లాసెస్​ పెట్టుకుని సూపర్​కూల్​ లుక్​తో దర్శనమిచ్చాడు చెర్రి.

    ఈ ఈవెంట్​ కోసం దాదాపు 9కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తారక్​, అలియాభట్​తో పాటు అజయ్​దేవగన్ కూడా పాల్గొననున్నారు. కాగా, బాలీవుడ్​ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ప్రమోషన్స్​లో ప్రత్యేక అతిథిగా హాజరు కానుండటం విశేషం. డిసెంబరు 19న ముంబయి నగరంలోనే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరగనుంది.  కాగా, ఇప్పటికే భారీ హైప్​ క్రియేట్​ చేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది జనవరి12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Also Read: డీ గ్లామర్ లుక్ లో మెగాస్టార్.. ఆ డైరెక్టర్ కి కలిసొచ్చేలానే ఉంది !