Nani Paradise Movie: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన దసర సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వరుసగా మాస్ సినిమాలు చేయాలనే దృఢ సంకల్పం ముందుకు సాగుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం మరోసారి మాస్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నాని కంటే ముందే ప్యారడైజ్ సినిమా కథని శ్రీకాంత్ ఓదెల మరొక హీరోకి వినిపించారట. కానీ ఆ హీరో ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో నానితోనే ఈ సినిమా చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది. ఇంతకీ ప్యారడైజ్ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ గా తెలుస్తోంది… అయితే ఈ సినిమాకి విజయ్ అయితే బాగా సెట్ అవుతాడని అనుకున్నప్పటికి ఇందులో హీరో గెటప్ డిఫరెంట్ గా ఉండడం వల్ల విజయ్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: కింగ్డమ్ విషయం లో విజయ్ కాన్ఫిడెంట్ కి కారణం ఏంటి..?
మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి హీరోకి ఇలాంటి ఒక మాస్ సినిమా పెడితే ఆయన టైర్ వన్ హీరో రేంజ్ మారిపోతారనే ఉద్దేశంతోనే నాని ఇలాంటి ఒక కథను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో చాలా వరకు బూతులు అయితే ఉంటాయి.
మరి ఆ బూతులను భరిస్తూ నాని చేసిన ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తు తను కూడా టైర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
Also Read: కింగ్డమ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తే విజయ్ టైర్ వన్ హీరోగా మారుతాడో తెలుసా..?
ఒకవేళ తను అనుకున్నట్టుగా ప్యారడైజ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం నాని టైర్ వన్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… శ్రీకాంత్ ఓదెల సైతం పాన్ ఇండియా డైరెక్టర్లలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోతాడు. డిఫరెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…