Kingdom Movie Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన తను ప్రస్తుతం మాస్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ఈనెల 31 తేదీన ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందని మొదటి నుంచి దర్శకుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నాడు. బ్రదర్స్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేస్తుంది అంటూ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద మొదటి నుంచి చాలా బజ్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. కింగ్ డమ్ సినిమా రెండు పార్టులకు కలిపి 100 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించినట్టుగా తెలుస్తోంది. నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ సినిమా బడ్జెట్ ని కూడా ఓపెన్ గా చెప్పేసాడు. అయితే కింగ్డమ్ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ రాబెట్టగలిగితే మాత్రం విజయ్ దేవరకొండ టైర్ వన్ హీరోగా మారిపోతాడు.
Also Read: అనసూయ కిల్లర్ లుక్స్… చూపులతోనే చంపేసింది!
లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఎలాంటి గొప్ప గుర్తింపు సంపాదించుకుంటాయి. ఆయన మారి ఎప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
కింగ్డమ్ సినిమాలో ఆయన డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్ర కావడం వల్ల విజయ్ దేవరకొండ చాలా ఛాలెంజ్ గా చేశారట. ఈ సినిమా కోసం ఆయన చాలా వరకు కష్టపడ్డట్టుగా కూడా ఆయన తెలియజేశాడు.
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
ఇక ఈ మూవీ తో పాటుగా ఆయన రవి కిరణ్ దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మరొక రెండు రోజులపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…