Pawan Kalyan : పెరుగుతున్న టెక్నాలజీ ని చూసి సంతోషించాలో, లేకపోతే భయపడాలి అర్థం అవ్వని పరిస్థితులు ఇటీవల కాలంలో ఏర్పడుతున్నాయి. కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్న ఈరోజుల్లో, ఇప్పటికీ ఎదుటి వ్యక్తులను మోసం చేసి డబ్బులు కొట్టేయాలని చూస్తున్నవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల మోసాలు హద్దులు దాటేస్తున్నాయి. అనేక మార్గాల ద్వారా వీళ్ళు జనాలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. ప్రభుత్వాలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనేక సార్లు అలెర్ట్ చేస్తున్నప్పటికీ, కొంతమంది ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ఇది నిజంగా క్షమించరాని నేరం. అన్ని వర్గాల్లో సినిమా హీరోలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వాళ్లకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకి వచ్చిన ఆకర్షితులు అయిపోతుంటారు జనాలు. దీనిని ఆసరా గా తీసుకొని కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది.
Also Read : ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…
పూర్తి వివరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). డైరెక్టర్ సుజీత్(Director Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ ని అడ్డుపెట్టుకొని ఒక సైబర్ నేరగాడు హైదరాబాద్ లోని ఛత్రినాక అరుంధతి కాలినీకి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి కి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ ని చూపించి మోసం చేసాడు. ఓజీ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే అధిక లాభాలు వస్తాయని, అందుకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కోటి 34 లక్షల రూపాయిలను తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత అతని నుండి ఎలాంటి ప్రతి స్పందన లేకపోవడంతో ఆ ప్రైవేట్ ఉద్యోగి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఈ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు అనేక సందర్భాల్లో ఇలాంటి సైబర్ నేరగాళ్ల గురించి అవగాహనా కల్పిస్తూ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. జనాలు దీనిని చాలా సీరియస్ గా తీసుకొని జాగ్రత్తలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలకు దూరంగా, ఇంటర్నెట్ అనేది ఉపయోగించని వాళ్ళు ఇలాంటి మోసాలకు గురైయ్యారు అంటే అర్థం ఉంది. ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేసేవాళ్ళు కూడా ఇలాంటివి నమ్మితే ఎలా?, ఒక సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు?, షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాక, విడుదల తేదీ ప్రకటించిన తర్వాత, విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రొమోషన్స్ చేస్తారు. ఓజీ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది?, ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది మేకర్స్ కి కూడా తెలియని పరిస్థితి. ఇది సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి తెలుసు, కానీ మోసపోయిన వ్యక్తికీ తెలియకపోవడం శోచనీయం.
Also Read : నన్ను తిట్టినా కొట్టినా.. 15 ఏళ్లు కలిసే ఉంటాం.. వైసీపీని అధికారంలోకి రానివ్వం.. పవన్ ప్రతిన