Pawan Kalyan OG movie Updates: త్వరలో విడుదల అవ్వబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో రోజురోజుకి అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్(Sujeeth) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా జరుపుకుంటూ ముందుకు పోతుంది. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ ఎడిటింగ్ తో సహా పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘ఫైర్ స్ట్రోమ్'(Fire Storm) పాట ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘హరి హర వీరమల్లు’ ఫలితం తో డీలాపడిన పవన్ అభిమానుల్లో ఎక్కడలేని నూతనోత్సాహాన్ని నింపింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి, అవేంటో చూద్దాం.
Read Also: ప్యారడైజ్ లో నాని లుక్ కి చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి సంబంధం ఉందా..?
ఇందులో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య,వదినలుగా కిక్ శ్యామ్, శ్రేయా రెడ్డి నటించారు. వాస్తవానికి ఈ రెండు క్యారెక్టర్స్ కోసం ముందుగా మోహన్ లాల్, టబు ని అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి ముందుగానే చెప్పాడట, నాకు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఎప్పుడైనా సినిమాకి బ్రేక్ పడొచ్చు,కాబట్టి అంత పెద్ద ఆర్టిస్ట్స్ ని మన సినిమా కోసం తీసుకోకు, ఒకవేళ బ్రేక్ పడితే మళ్ళీ డేట్స్ సర్దుబాటు అవ్వడం కష్టం అవుతుంది అని అన్నాడట. దీంతో టాప్ యాక్టర్స్ తో కాకుండా, పెద్దగా డిమాండ్ లేని నటులతోనే ఈ చిత్రంని పూర్తి చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కోసం కూడా బలమైన స్టార్ క్యాస్ట్ ని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి క్యారక్టర్ ని ప్రకాష్ రాజ్ చేశాడు. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ ని తీసుకోవాలని అనుకున్నాడు డైరెక్టర్ సుజిత్.
Read Also: ఒక్క ప్రాంతం నుండి గంటకు 50 వేల టిక్కెట్లు..’కూలీ’ సునామీ మొదలైంది!
అదే విధంగా పవన్ కళ్యాణ్ తమ్ముడి క్యారక్టర్ కోసం మలయాళం స్టార్ హీరో తొనివో థామస్ ని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ క్యారక్టర్ ని వెంకట్ చేశాడు. ఇక ఈ చిత్రం లోని మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం ముందుగా కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన రక్షిత్ శెట్టి ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ క్యారక్టర్ ని ఇమ్రాన్ హష్మీ చేశాడు. ఇలా క్యాస్టింగ్ మొత్తం మారిపోయింది. సాధారణ క్యాస్టింగ్ తోనే ఈ చిత్రం పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడితే, ఇక ముందు అనుకున్న క్యాస్టింగ్ తో సినిమా తీసి ఉండుంటే ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడేవో, ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండేవో, ఊహించుకోడానికి కూడా సాధ్యపడేది కాదు. ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేపిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు నెలకొల్పబోతుందో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాల్సిందే.