Pawan Kalyan OG Story: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం నుండి ఇప్పటి వరకు మనం హీరో,హీరోయిన్లకు సంబంధించిన షాట్స్ ని మాత్రమే మేకర్స్ చూపిస్తూ వచ్చారు. ఇతర నటీనటుల గురించి పెద్దగా చూపించలేదు. ముఖ్యంగా విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రం లో ఎలా ఉండబోతున్నాడు?, ఆయన క్యారక్టర్ ఎలా ఉంటుంది వంటి వాటిపై ఫ్యాన్స్ కి ఎలాంటి అవగాహన ఉండేది కాదు. అందుకే నేడు ఆయన క్యారక్టర్ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. వాస్తవానికి ఈ గ్లింప్స్ వీడియో ఎప్పుడో రావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేస్తే మంచి రీచ్ ఉంటుందని నేడు విడుదల చేశారు. గ్లింప్స్ లో సగానికి పైగా విలన్ నే హైలైట్ చేసి చూపించారు. కానీ చివరి 20 సెకండ్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ని చూపించారు.
Also Read: ‘ప్రేమిస్తే’ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా తయారయ్యిందో మీరే చూడండి!
ఆయన స్టైల్, స్వాగ్ మొత్తం గ్లింప్స్ ని డామినేట్ చేసింది. ఇక థమన్ అందించిన మ్యూజిక్ మరో ఎత్తు. ఆయన నుండి ఈ రేంజ్ టాప్ క్లాస్ మ్యూజిక్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎందుకంటే ఇలాంటి స్టఫ్ ఎక్కువగా అనిరుద్ నుండి వస్తూ ఉంటుంది. తమన్ అనిరుద్ ని సైతం ఈరోజు డామినేట్ చేసాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా లో ఇమ్రాన్ హష్మీ క్యారక్టర్ పేరు ఒమీ. ఈయన క్యారక్టర్ కూడా పవన్ కళ్యాణ్ క్యారక్టర్ తో సమానంగా చాలా వయొలెంట్ గా ఉంటుందట. విలన్ క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరో క్యారక్టర్ అంతలా ఎలివేట్ అవుతుంది అని చెప్పడానికి నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఒక ఉదాహరణ. చాలా స్టైలిష్ గా వయొలెంట్ గా కనిపించాడు ఇమ్రాన్ హష్మీ. అండర్ వరల్డ్ డాన్ గా ముంబై ని ఒకప్పుడు ఏలి వెళ్లిన ఓజాస్ గంభీర ని మళ్లీ తిరిగి రమ్మని పిలుస్తూ ఒమీ వార్నింగ్ కాల్ చేస్తున్నట్టు ఉన్న గ్లింప్స్ ని చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలోని వర్తమాన కాలం లో చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
సినిమాలో ఫస్ట్ హాఫ్ మొదటి షాట్ నుండే పవన్ కళ్యాణ్ ఉంటాడు, కానీ అవన్నీ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలే ఉంటాయట. ప్రస్తుత కాలానికి సంబంధించిన స్క్రీన్ ప్లే మాత్రం ప్రీ ఇంటర్వెల్ నుండి ఉండబోతుందని తెలుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒమీ, ఓజాస్ గంభీర కి సంబంధించిన తండ్రులు మంచి స్నేహితులు. ముంబై కి వచ్చి వ్యాపారం చెయ్యాలని అనుకుంటారు. కానీ కొన్ని అనుకోని కారణాల వాళ్ళ భద్ర శత్రువులు గా మారుతారు. ఆ శత్రుత్వం ఒమీ, ఓజాస్ వరకు కొనసాగుతుంది, వీళ్ళ మధ్య జరిగే పోరాటం వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. చూడాలి మరి అందులో ఎంతమాత్రం నిజం ఉంది అనేది.
