Director Sujeeth: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి, సినిమాల్లో హీరో అవుదామని ఆడిషన్స్ చేసి, తన స్నేహితుడు ఫిలిం స్కూల్ లో హీరో కి బదులు డైరెక్టర్ గా అప్లికేషన్ పెట్టడం తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే కోచింగ్ తీసుకొని, ఇండస్ట్రీ లో ఒక్కటంటే ఒక్క అవకాశం కోసం ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదురుకొని, నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసే ఓజీ లాంటి సినిమాకు డైరెక్టర్ గా నిల్చిన సుజీత్(Sujeeth), రాబోయే రోజుల్లో సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లలో ఒకడిగా మారబోతున్నాడా?, ప్రస్తుతానికి మన సౌత్ ఇండియా లో రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ మరియు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు సుజిత్ ఈ ఎలైట్ లిస్ట్ లో చేరబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
Also Read: ‘ప్రేమిస్తే’ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా తయారయ్యిందో మీరే చూడండి!
పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఆయన చేసిన ‘ఓజీ'(They Call Him OG చిత్రం లోని ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే చాలా స్టఫ్ ఉన్న డైరెక్టర్ లాగా అనిపించాడు. ఇంతటి స్టైలిష్ మేకింగ్ చేయడం ప్రస్తుతం ఇండియా లో ఏ డైరెక్టర్ కి కూడా సాధ్యం కాదని నేడు విడుదల చేసిన ఓజీ లేటెస్ట్ గ్లింప్స్ ని చూస్తే చెప్పొచ్చు. స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి సుజీత్, తన అభిమాన హీరోని ఎంత అద్భుతంగా చూపించాలో, అంతే అద్భుతంగా చూపించినట్టు ఈరోజు విడుదలైన గ్లింప్స్ ని చూస్తే అర్థం అవుతుంది. రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో పాన్ ఇండియా లెవెల్ లో ఎలా పేలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి నుండే సుజిత్ పేరు ఇండస్ట్రీ లో బలంగా వినపడింది. కచ్చితంగా ఓజీ తో ఆయన ప్రభంజనమే సృష్టించబోతున్నాడని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
అయితే సుజిత్ లో ఒకే ఒక్క మైనస్ ఉంది. ప్రతీ సన్నివేశాన్ని చాలా కొత్తగా తియ్యాలని అనుకుంటాడు. ఇక్కడే తేడా కొడుతోంది. ఆయన మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’ ని చాలా క్రేజీ గా తెరకెక్కించాడు. అతని పనితనాన్ని చూసే రెబల్ స్టార్ ప్రభాస్ పిలిచి మరీ సాహూ చిత్రం చేసే అవకాశం ఇచ్చాడు. రెండవ చిత్రం తోనే ఏకంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం అవకాశం రావడం తో ప్రతీ సన్నివేశం కొత్తగా తియ్యాలని కసితో, జనాలకు చాలా సన్నివేశాలు అర్థం కాకుండా తీసాడు. ఇదే ఆ సినిమా ఫెయిల్యూర్ కి ముఖ్య కారణాల్లో ఒకటిగా మారింది. ఆ సినిమా మిగిల్చిన అనుభవాల నుండి నేర్చుకొనే ఓజీ చిత్రాన్ని తీసినట్టుగా అనిపించింది. కాబట్టి ఈసారి ఆయన కుంభస్థలం బద్దలు కొట్టేలాగానే ఉన్నాడు. చూడాలి మరి సుజీత్ మరో లోకేష్ కనకరాజ్ అవుతాడా లేదా అనేది.