Premisthe Movie Heroine Sandhya: 2004 వ సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రేమిస్తే’ అనే చిత్రం అటు తమిళం లోనూ,ఇటు తెలుగులోనూ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో మనమంతా చూసాము. యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ లవ్ ఫెయిల్యూర్ చిత్రాన్ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించగా బాలాజీ శక్తివేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భరత్, సంధ్య(Sandhya) లు ఇందులో హీరోహీరోయిన్లు గా నటించారు. సంధ్య కి ఇదే తొలిసినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యాక ఆమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాల్లో అవకాశాలు కూడా క్యూలు కట్టాయి. కానీ ఎందుకో ఆమెకు మళ్లీ ప్రేమిస్తే స్థాయిలో హిట్ మాత్రం దొరకలేదు. హిట్స్ లేకపోవడం తో ఈమెకు నెమ్మదిగా హీరోయిన్ అవకాశాలు రావడం తగ్గిపోయాయి.
క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో చాలా కాలం వరకు నటించింది. ముఖ్యంగా మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన అన్నవరం చిత్రం లో పవన్ చెల్లిగా ఎంత అద్భుతంగా నటించిందో మనమంతా చూసాము. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా, సంధ్య కి మాత్రం మన తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభించింది. అలా క్యారక్టర్ ఆర్టిస్టు గా, మధ్యలో హీరోయిన్ గా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన సంధ్య 2015 వ సంవత్సరం తర్వాత సినిమాలు పూర్తి మానేసింది. ఆ తర్వాత వెంకట చంద్రశేఖరన్ అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని 2015 వ సంవత్సరం లో పెళ్లాడింది. ఈమెకు ఇప్పుడు మాయ అనే కూతురు, అజిత్ అనే కొడుకు ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఎక్కడుందో, ఏమి చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు.
చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర అవుతుంటారు. కానీ ఈమె అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. సినిమాలు మానేసిన తర్వాత పూర్తిగా తన జీవితాన్ని ప్రైవేట్ మోడ్ లోకి పెట్టేసింది. అయితే ఈమె వీరాభిమాని ఒకరు ఇన్ స్టాగ్రామ్ లో సంధ్య కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలను ఒక వీడియో గా చేసి అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రేక్షకులు సంధ్య ని చూసి చాలా సంతోషిస్తున్నారు. తాము చిన్నప్పుడు చూసిన సంధ్య ఇప్పుడు తన కుటుంబం తో ఎంతో సంతోషంగా ఉందని, కుదిరితే సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలకు సంబంధించిన వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.