OG Movie Overseas Bookings: సరిగ్గా మరో 25 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమధ్య కాలం లో ఏ పవన్ కళ్యాణ్ సినిమాకు లేనంత క్రేజ్, హైప్ ఈ చిత్రం పై ఏర్పడింది. రెండేళ్ల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో ఈ సినిమాపై ఇంతటి హైప్ పెరగడానికి కారణం అయ్యింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, నేటి తరం యువత ఇష్టపడే జానర్ లో నటించడం తో ఆయన అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూసేలా చేశాయి. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు చూడనంత అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకి చూస్తున్నామంటూ అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే ఈ చిత్రానికి దాదాపుగా 82 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత రోజు రోజుకి బుకింగ్స్ ట్రెండ్ పెరుగుతూ పోయింది. రెండవ రోజు ఏకంగా లక్షా 84 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు పెరిగింది. అలా బుకింగ్స్ ప్రారంభించిన రెండు రోజులకు 2 లక్షల 67 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా, మూడవ రోజు ఏకంగా 5 లక్షల డాలర్లకు ఎగబాకింది. అంటే రెండు లక్ష 40 వేల వరకు ముందు రోజు తో పోలిస్తే గ్రాస్ పెరిగింది అన్నమాట. ఇలాంటి ట్రెండ్ ఈమధ్య కాలంలో ఏ పాన్ ఇండియన్ సినిమాకు నడవలేదు. నాల్గవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దాదాపుగా రెండు లక్ష గ్రాస్ వసూళ్లు పెరిగిందట. మొత్తం మీద నాలుగు రోజులకు ఈ సినిమాకు 7 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి.
చూస్తుంటే ఈ చిత్రం ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలుస్తుందని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 2 న ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటే చాలా బాగుంటుందని, ఆయన పుట్టినరోజు కి అభిమానులు బహుమతి ఇచ్చినట్టుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సెప్టెంబర్ 2 కి ఈ సినిమా ఆ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఫాస్టెస్ట్ 1 మిలియన్ ప్రీ సేల్స్ గ్రాస్ రికార్డు #RRR చిత్రం మీద ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ చిత్రం ఆ మార్కుని అందుకుంది. ఇప్పుడు ఓజీ చిత్రం ఆరు రోజుల్లో అందుకునే అవకాశం ఉంది. నాన్ రాజమౌళి రికార్డు క్యాటగిరీ లో దీనిని వేసుకోవచ్చు.