OG Shirts: మరో 25 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే సరైన బిజినెస్ లేక డీలా పడిపోయిన టాలీవుడ్ మార్కెట్ కి పూర్వ వైభవం రావాలంటే ఇలాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమా విడుదల అవ్వాలని, దానికి మంచి పాజిటివ్ టాక్ రావాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా పై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో చెప్పడానికి రీసెంట్ గా నార్త్ అమెరికా లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏ ఇండియన్ సినిమాకు జరగనంత అడ్వాన్స్ బుకింగ్స్ ఈ చిత్రానికి జరుగుతున్నాయి. బుకింగ్స్ మొదలు పెట్టిన నాలుగు రోజులకే దాదాపుగా 7 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్ క్రేజ్ ఉంటే మేకర్స్ దానిని ఉపయోగించుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
అందుకే ఓజీ మర్చండైజ్ ని అభిమానుల కోసం తీసుకొచ్చారు. OG అనే టైటిల్ తో ఉండే ఈ హుడీస్ ని మొత్తం నాలుగు మోడల్స్ గా విడుదల చేశారు. ఈ నాలుగు హుడీస్ కూడా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయాయి. మార్కెట్ లో ఒక్క హుడీని కూడా వదలకుండా కొనేశారు. కేవలం వీటి ద్వారా మేకర్స్ కి 5 కోట్ల రూపాయిల లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చరిత్ర లో ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ చిత్రం విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ బ్యాండ్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయట. ఎక్కడ చూసినా ఈ బ్రాండ్స్ నే కనిపించేవి. ఇప్పుడు కూడా అదే మేనియా కొనసాగుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మేనియా ని ఇప్పటి తరం అభిమానులు చూసి ఉండరు. ఓజీ చిత్రం అప్పటి మేనియా ని మరోసారి గుర్తు చేస్తుంది.
ఇప్పటికే హుడీలు మొత్తం హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం తో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి మర్చండైజ్ ని సెప్టెంబర్ 1న వెబ్ సైట్ లో పెట్టబోతున్నారు. వీటికి ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో చూడాలి. కాకపోతే వీటి కాస్ట్ చాలా ఉందని అభిమానుల అభిప్రాయం. అంత ధర పెట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఎగబడి మరీ కొన్నారు. కానీ సెప్టెంబర్ 1న రాబోయే మార్చండైజ్ కి అయినా అందుబాటులో ఉండే రేట్స్ పెట్టాలని కోరుకుంటున్నారు. మరి అది సాధ్యం అవుతుందా లేదా అనేది రేపు చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి టీజర్ లేదా ఒక అద్భుతమైన పోస్టర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.