OG Movie First Day Collections: నేడు విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ పాజిటివ్ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి 65 నుండి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా ఓవర్సీస్ లో 6 మిలియన్ డాలర్ల గ్రాస్ వస్తుందని అంటున్నారు. ఈరోజు సాయంత్రం నుండి భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంటే ఇంకా పెద్ద నెంబర్ వచ్చే అవకాశాలు ఉంటాయట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 150 నుండి 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి GST లేకుండా 23 కోట్ల రూపాయిల వర్త్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ప్రీమియర్ షోస్ ద్వారా భారీ నుండి అతి భారీ థియేట్రికల్ షేర్ వచ్చినట్టు సమాచారం. కేవలం ఒక్క హైదరాబాద్ సిటీ నుండే ఆఫ్ లైన్ లో ఉన్నటువంటి షోస్ ని తీసేస్తే 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి. హైదరాబాద్ లోని దాదాపుగా ప్రతీ సింగిల్ థియేటర్ లోనూ ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ పడింది. కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి నైజాం లో GST తో కలిపి ఆల్ టైం రికార్డు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆల్ టైం టాప్ 2 లేదా టాప్ 3 రావొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.
తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 5 కోట్ల 70 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 5 ప్రాంతాల నుండే వర్త్ షేర్ 50 కోట్ల రూపాయిల వరకు ఉంది. రిటర్న్ GST కలిపితే కచ్చితంగా 60 కోట్ల మార్కుని దాటొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిత్రం కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 మరియు #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదే రేంజ్ ఊపు వీకెండ్ వరకు కొనసాగితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.