Masaru Emoto water experiment: గోడకు చెవులు ఉంటాయి.. మెల్లగా మాట్లాడు.. అని కొందరు సామెతలు చెబుతూ ఉంటారు. ఈ సామెత అర్థం ఏంటంటే ఎవరైనా మనం చెప్పే విషయాలు వింటూ ఉంటారని.. అయితే ఇప్పుడు గోడకు మాత్రమే కాదు నీటికి కూడా చెవులు ఉంటాయని ఓ శాస్త్రవేత్త నిరూపించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఆయన ఒక పరిశోధన ద్వారా దీనిని నిరూపించాడు కూడా. నేటికి వినే శక్తి ఉంటుందని.. అది ఎటువంటి వాయిస్ వింటుందో ఆ ప్రకారంగా దాని స్వభావాన్ని మార్చుకుంటుందని ఆయన తెలిపారు. ఇంతకీ నీటికి కూడా చెవులు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆయన ఎలాంటి పరిశోధన ద్వారా నిరూపించారు?
నేటికీ రంగే ఉండదు.. చెవులు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. కానీ నీటికి చెవులు ఉంటాయని.. అవి మనం చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకుంటాయని Masaru Emoto అనే శాస్త్రవేత్త నిరూపించాడు. ఒకసారి ఈయన మూడు గ్లాసుల నిండా నీరు తీసుకున్నాడు. ఈ మూడింటిలో శనగపప్పు వేశాడు. ఈ శనగపప్పు ఒకే పరిణామం లో ఉండేలా చూస్తున్నాడు. అయితే ప్రతిరోజు ఒక గ్లాస్ వద్దకు వెళ్లి థాంక్యూ అని చెప్పాడు. మరో గ్లాసు వద్దకు వెళ్లి వరస్ట్ ఫెలో అని చెప్పాడు. ఇంకో గ్లాసులు పట్టించుకోలేదు. ఇలా ప్రతిరోజు ఈ విషయాలను ఆ గ్లాసుల వద్దకు వెళ్లి చెబుతూ కొన్ని రోజులపాటు వెయిట్ చేశాడు.
ఆ తర్వాత థాంక్యూ అని చెప్పిన గ్లాసులోని శనగపప్పు అలాగే ఫ్రెష్ గా కనిపించింది. వరస్ట్ ఫెలో అని చెప్పిన గ్లాసు కొంతవరకు బ్లాక్ అయిపోయింది. ఇక పూర్తిగా పట్టించుకోని గ్లాసు కంప్లీట్ గా నల్లగా మారిపోయింది. అంటే ఇక్కడ కొన్ని గ్లాసుల వద్ద పాజిటివ్ మాటలు చెప్పినప్పుడు వాటిని మీరు రిసీవ్ చేసుకుని అందులో ఉండే శనగపప్పును ఫ్రెష్ గా ఉంచాయి. కానీ వరస్ట్ ఫెలో అని మాటను విన్న శనగపప్పు పాడైపోయింది. ఎలాంటి వాయిస్ విని శనగపప్పు మాత్రం పూర్తిగా పనికిరాకుండా పోయింది.
ఇదే విషయం మనుషుల్లో కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడూ తన గురించి ఇతరుల గురించి పాజిటివ్ గా మాట్లాడితే తన జీవితం కూడా సంతోషకరంగా ముందుకు వెళుతుంది. అలా కాకుండా నెగిటివ్ గా ఆలోచిస్తూ.. నెగిటివ్ గా ఉండాలని కోరుకునే వారికి నెగిటివ్ వాతావరణమే ఉంటుంది. అందువల్ల ఎటువంటి సందర్భంలోనైనా పాజిటివ్ గా ఆలోచించి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది తమకు ఏది రాదు.. ఏం చేయలేను.. అనే భావన ఉంటుంది. ఇలాంటివారు ఏదైనా సాధించగలం.. కచ్చితంగా చేయగలం అనే మనసుతో ముందుకు వెళితే వారు చేపట్టిన పని ఎప్పటికైనా పూర్తి చేయగలుగుతారు.
మరికొందరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతారు. దీంతో వారు ఎప్పుడూ నెగిటివ్ మైండ్ తోనే ఉండిపోతారు. వారి పనులు కూడా అలాగే చేస్తూ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. అందువల్ల ఎప్పటికైనా ఈ అలవాటు ఉంటే దానిని మార్చుకోవడం మంచిది.