Winter Safety Tips: వర్షాకాలం దాదాపు పూర్తి కావస్తున్నా.. ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అటు ఎండాకాలం పూర్తికాకముందే జూన్లోనే భారీ వర్షాలు కురిసాయి. ఈ ఏడాది భారతదేశం అంతటా భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉండిపోయాయి. ఇలా ఈసారి భారీ వర్షాలు కురవడానికి కారణం La Nino ఎఫెక్ట్ అని కొందరు సైన్స్ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే లా nino ఎఫెక్ట్ కేవలం వర్షానికి మాత్రమే కాకుండా వచ్చే చలికాలం పై కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. దీంతో కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గతంలో లా nino సంభవించినప్పుడు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇప్పుడు కూడా వచ్చే చలికాలంలో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయే అవకాశం ఉందని కొందరు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈసారి వర్షాలు భారీగా కురవడంతో తీవ్రమైన చలి ఉంటూ కొన్ని రకాల వ్యాధులు కూడా ఉద్యోగం నుంచి అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవడం మంచిది. లేదంటే చలికాలం ప్రారంభమైన తర్వాత ఆ వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
వచ్చే చలికాలంలో వేడి నీరు ఎక్కువగా అవసరం అయ్యే అవకాశం ఉంది. దీంతో చలికాలంలో వాటర్ హీటర్ కు డిమాండ్ పెరిగి ధర పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటర్ హీటర్ ను ముందే కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిది. కొందరు చలికాలంలో మైక్రోఓవెన్ అవసరం ఉంటుందని అప్పుడే కొనుగోలు చేస్తారు. కానీ దీనిని ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటే కొంతవరకు ఆదాయాన్ని సేఫ్ చేసుకోవచ్చు. అలాగే చలి నుంచి రక్షించేందుకు స్వెటర్లు, బ్లాంకెట్స్ వంటివి కూడా ముందే కొనుగోలు చేసుకోవడం మంచిది. వచ్చే చలికాలంలో కచ్చితంగా కొనాల్సి వస్తుంది. ఆ సమయంలో వీటికి డిమాండ్ పెరుగుతుంది.
ఇక రాబోయే చలికాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అస్తమా సమస్య ఎదుర్కొనేవారు ముందు జాగ్రత్తగా అవసరమైన kits ముందే ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేకుంటే చలికాలంలో వీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వీటి కొరత కూడా ఉంటుంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని రకాల మెడిసిన్ ను ముందే అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత ఏ రోజు ఎలా ఉంటుందో ముందే అంచనా వేయలేం. ఒక్కో రోజు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కొన్ని మెడిసిన్ తీసుకోవడానికి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల ముందు జాగ్రత్తగా ఇంట్లోనే స్టోర్ చేసుకోవడం మంచిది.