OG latest teaser Talk: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ(They Call Him OG) చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్రం నుండి మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ బర్త్డే గ్లింప్స్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ గ్లింప్స్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని చూపిస్తారని అనుకున్నారు కానీ, విలన్ క్యారక్టర్ ఇమ్రాన్ హష్మీ ని ఎక్కువ గా చూపించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కంటెంట్ మాత్రమే వచ్చింది. నేడు విడుదల చేసిన వీడియో తో విలన్ ఎలా ఉంటాడో చూపించారు.
టీజర్ మొదలు అవ్వగానే ఇమ్రాన్ హష్మీ ‘డియర్ ఓజీ..నిన్ను కలవాలని..నీతో మాట్లాడాలని..నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న..మీ ఒమీ. హ్యాపీ బర్త్డే ఓజీ’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. హ్యాపీ బర్త్ డే ఓజీ అన్నప్పుడు చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న షాట్స్ ని బాటమ్ టు టాప్ చూపిస్తారు. ఆ షాట్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చివరి 20 సెకండ్స్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ తో చాలా వినసొంపుగా ఉండేలా అదరగొట్టేసాడు. వాస్తవానికి ఈ టీజర్ లో చాలా షాట్స్ పెట్టారట. అవి వేరే లెవెల్ లో ఉన్నాయట. కానీ వాటిని చివరి నిమిషం లో కట్ చేసి ట్రైలర్ కోసం దాచి పెట్టారట. థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 18 న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక పోతే ఈ టీజర్ ఎలా ఉందో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
