Bigg Boss 9 Contestant List: టెలివిజన్ రంగంలో పెను మార్పులు వచ్చాయి.గత 8 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ షో భారీ పాపులారిటిని సంపాదించుకుంది… ఇక ఇప్పటి వరకు తెలుగులో ఏ షో కి రానంత పాపులారిటీ ఈ షోకి రావడం అలాగే ఇప్పుడు తొమ్మిదో సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ షో మీద భారీ అంచనాలైతే ఉన్నాయి…ఇక దానికి తగ్గట్టుగానే ఈ షో లో పాల్గొనబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చింది.
ఆశ షైనీ
ఈమె చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాలయ్య బాబు బి.గోపాల్ డైరెక్షన్ లో చేసిన నరసింహ నాయుడు సినిమాలో నటించి చాలా బాగా ఫేమస్ అయింది…ఈమె బిగ్ బాస్ 9 షో లో కంటెస్టెంట్ గా రాబోతున్నారు…
భరణి శంకర్
చాలా సీరియల్స్ లో సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు…ఈయన బాహుబలి, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో నటించారు…
సుమన్ శెట్టి
జయం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు…ఇక ఈయన ఈసారి బిగ్ బాస్ లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…
తనూజ గౌడ
సీరియల్స్ నటించి నటి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది…ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లో ఉంటే ఆమె ఇమేజ్ ఈ షో కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను తీసుకున్నారు…
రామ్ రాథోడ్
రామ్ రాథోడ్ ప్రైవేట్ సాంగ్స్ చేసి మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రాణి ముంబై కి రాను అనే సాంగ్ తో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయన హౌజ్ లో ఉంటే బాగుంటుంది.
సంజన
ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది… ఆ తర్వాత ఆమె మరికొన్ని సినిమాలు చేసినప్పటికి ఆమెకు పెద్దగా గుర్తింపైతే రాలేదు…ఈమె షో లో ఉంటే ఎక్కువ గొడవలు జరిగి షో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను తీసుకున్నారు…
శ్రేష్టి వర్మ
జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన ఈమె ఆ తర్వాత జానీ మాస్టర్ మీద కేస్ పెట్టి వార్తల్లో నిలిచింది…ఇక ఆ తర్వాత పుష్ప 2 సినిమాలో పుష్ప సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా చేసింది…ఈమె ఒంటరిగా తనకి జరిగిన అన్యాయం మీద పోరాటం చేసింది కాబట్టి ఆమె ఘాట్స్ కి అందరూ ఫిదా అయిపోయారు…అందుకే ఆమెను ఈ షోలోకి తీసుకున్నారు…
హర్షిత్ రెడ్డి
శుభం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ను సైతం బిగ్ బాస్ లోకి సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…
ఇక వీళ్ళతో పాటుగా మరి కొంతమందిని సైతం ఈ షో లో భాగం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు…