Pawan Kalyan OG 2 Update: రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతలా నిరాశపర్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చలేదు. ఒక సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే లేకుండా, కేవలం సన్నివేశాలను మాత్రమే రాసుకొని, దాని చుట్టూ కథ అల్లాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ కారణం చేత అసలు కథ ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వని పరిస్థితి. రాజకీయాలు అంటారు, టెర్రరిస్ట్స్ అంటారు, అసలు ఏమి జరుగుతుంది రా బాబు అని అభిమానులు సైతం థియేటర్స్ లో జుట్టు పీక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిల్చిన చిత్రంగా మిగిలింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అభిమానులు ఈ సందర్భంగా ఆదివారం రోజున ఈ సినిమా పట్ల వారిలో దాగున్న అసంతృప్తి ని బయటకు వ్యక్తపరిచారు.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
ట్విట్టర్ లో దాదాపుగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ సినిమాల జమానా ముగిసిపోయి చాలా కాలం అయ్యింది. దయచేసి వాటి జోలికి వెళ్లొద్దు, ఓజీ చిత్రం చూసిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు నీ నుండి ఆ స్థాయి సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు, దయచేసి అలాంటి సినిమాలే చెయ్యి అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అభిమానులు రిక్వెస్ట్ చేశారు. ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ని బాగా గమనిస్తున్నాడు. సినిమాల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అభిమానులు తన నుండి ఏమి కోరుకుంటున్నారో ఆయనకు వెంటనే తెలిసిపోతున్నాయి. అందుకే అభిమానుల ఆర్తనాదాలను గమనించిన ఆయన , వెంటనే వాళ్ళని ఓదార్చే విధంగా నిన్న తన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ‘ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వేయించిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ గారు పలానా సినిమా ఒప్పుకున్నాడు అంటూ వార్తలు ఈమధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈమధ్య కాలం లో ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు. ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే అధికారికంగా ప్రకటిస్తాము. ఇక ‘ఓజీ 2′ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే, సరైన సమయం లో పవన్ కళ్యాణ్ గారే అధికారికంగా ప్రకటిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ తర్వాత అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఒక్కసారిగా మళ్లీ ట్విట్టర్ కి తిరిగి వచ్చేసారు. తన తదుపరి చిత్రం ‘ఓజీ 2 ‘ నే ఉంటుంది అనే హింట్ ఇవ్వడం తో అభిమానులు సంబరాలకు హద్దులు లేకుండా పోయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితాన్ని కూడా మర్చిపోయారు.
As of now, Sri @PawanKalyan garu has not taken up any new film commitments. Speculations about ongoing projects are not accurate.
At present, there are no immediate plans to commence new films. Any developments will be communicated through official channels when ready.
With…
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) March 23, 2026
