Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan movie news : పవన్ కళ్యాణ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన నిర్మాత...

Pawan Kalyan movie news : పవన్ కళ్యాణ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన నిర్మాత దిల్ రాజు.. ఇది నిజంగా ఊహించనిది..

పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి సినీ ఇండస్ట్రీ లో వీరాభిమానులు ఉన్నారు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) కూడా ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి దిల్ రాజు అప్పట్లో ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా..?, పూర్తి వివరాల్లోకి వెళ్తే, జానీ వంటి దారుణమైన పరాజయం తర్వాత, పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని, తన స్వీయ దర్శకత్వం లో ‘సత్యా గ్రహి’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ కి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అప్పట్లో AM రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల , అప్పట్లో ఆపేయాల్సి వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నే నిర్మించాలని అనుకున్నాడట. ఇండస్ట్రీ లోకి ఆయన అడుగుపెట్టిన ప్రారంభ రోజులవి. అయితే సినిమా స్టోరీ స్కేల్ చూసిన తర్వాత ఆరోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అవుతుందని దిల్ రాజు అంచనా వేసాడు. అంత డబ్బులు తాను అప్పట్లో సంపాదించలేదని , తనని నమ్మి ఆ స్థాయిలో ఫైనాన్స్ కూడా చేసే వాళ్ళు లేరని దిల్ రాజు ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. అప్పుడు ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి AM రత్నం వద్దకు వెళ్ళింది. చాలా ఉత్సాహం తో పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఆ ఈవెంట్ కి దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కూడా కొట్టాడు. అల్లు అర్జున్ , విక్టరీ వెంకటేష్ , నితిన్ వంటి వారు ఈ పూజ కార్యక్రమానికి గెస్టులుగా వచ్చారు.

అంతటి అట్టహాసంగా మొదలు పెట్టిన ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే 2014 మరియు , 2017 వ సంవత్సరం లో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి దిల్ రాజు ముందుకొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవ్వడం వల్ల, ఈ సినిమా ప్రస్తావన మరోసారి రాలేదు. ఆ తర్వాత ఇదే దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్ ‘ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా పీక్ కోవిద్ ని సైతం తట్టుకొని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇప్పుడు త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మరో సినిమాని నిర్మించడానికి దిల్ రాజు రెడీ గా ఉన్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సరిపోతుంది . ఈసారి వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి మూవీ రాబోతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version