Homeబిజినెస్Maruti Suzuki Ignis: ఈ కారు ఇక నుంచి కనిపించదు.. కావాలంటే ఇప్పుడే కొనుక్కోండి..

Maruti Suzuki Ignis: ఈ కారు ఇక నుంచి కనిపించదు.. కావాలంటే ఇప్పుడే కొనుక్కోండి..

Maruti Suzuki: కంపెనీకి చెందిన కార్లు అంటే చాలామంది లైక్ చేస్తారు. దశాబ్దాల కింద ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లు ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉన్నాయి. దాదాపు మారుతి కార్లన్నీ సక్సెస్ గానే నిలుస్తూ వస్తున్నాయి. కానీ దీని నుంచి 2017లో మార్కెట్లోకి వచ్చిన Ignis మాత్రం తొమ్మిది సంవత్సరాల తర్వాత ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కారును ఎప్పుడైనా ఉత్పత్తి నిలిపివేస్తామని చెప్పినప్పటికీ ప్రత్యేకంగా తేదీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి దీని నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ కారు కనిపించదని తెలుస్తోంది. ఇంతకీ ఈ కారు విశేషాలు ఏంటంటే..

2017లో మార్కెట్లోకి వచ్చిన Ignis స్టైలిష్ గా ఆ సమయంలో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత దీని అప్డేట్ ఇస్తూ వచ్చారు. 2022 సంవత్సరంలో ఈ కారు 51,176 యూనిట్ల సేల్స్ చేసుకుంది. ఇగ్నీస్ చరిత్రలో ఇదే అత్యధికంగా జరిగిన విక్రయాలు. అయితే ఇది స్విఫ్ట్ కంటే తక్కువ అని చెప్పవచ్చు. అదే ఏడాది చివరిలో ఈ కారు 1,76,424 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. అయితే ఆ తర్వాత దీని అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల కాలంలో ఒక నెలలో దీని అమ్మకాలు 2000 కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇది మార్కెట్లోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే అప్డేట్ అయింది. 2020లో మిడ్ లైఫ్ సైకిల్, 2019లో సేఫ్టీ ఫీచర్స్ ను అప్డేట్ చేశారు. ఇందులో భాగంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ను చేర్చారు. మారుతి కంపెనీలో ఉన్న కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి.

ఇగ్నీస్ కారు సియాజ్ కు దగ్గరగా ఉంటుంది. సియాజ్ కూడా ఎలాంటి అలజడి లేకుండా నిశ్శబ్దంగా కనుమరుగైపోయింది. ఇప్పుడు ఇగ్నీస్ కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అయితే త్వరలో ఇది సబ్ కాంట్రాక్టు SUV గా అవతరిస్తుందని అంటున్నారు. అలా వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ Exter, టాటా పంచ్ కార్లకు పోటీ ఉంటుందని అంటున్నారు.

మారుతి సుజుకి ఇగ్నిస్ మార్కెట్లో రూ.5.35 లక్షల ప్రారంభంతో విక్రయించారు. నెక్సా నైన్ అప్ లో ఉన్న ఈ మోడల్ లో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండేది. అలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా చేర్చారు. అయితే డీజిల్ ఇంజన్ వేరియంట్కు డిమాండ్ తగ్గడంతో 2018లో దీనిని నిలిపివేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version