Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇచ్చిన ఒక ప్రముఖ తమిళ ఇంటర్వ్యూ లో, కచ్చితంగా సినిమాలు చేస్తానని, నాకు డబ్బులు అవసరం అయ్యేంత వరకు వాటిని ఆపను అని చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా మొత్తం పూర్తి అవుతుంది. మే9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ సినిమా అప్పటికీ రెడీ అయ్యేలా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్తాను అని చెప్పిన నాలుగు రోజుల డేట్స్ ఇంకా ఇవ్వలేదు. కారణం ఆరోగ్య సమస్యలే అని తెలుస్తుంది. నేడు కూడా ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొనలేదు.
Also Read : పవన్ కళ్యాణ్ చివరి సినిమాను ఆ స్టార్ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..?
ఈ సినిమా కాకుండా , ‘ఓజీ’ చిత్రం కూడా ఆయన చేయాల్సి ఉంది. దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ ని కేటాయిస్తే సినిమా మొత్తం పూర్తి అవుతుంది. నాలుగు రోజుల డేట్స్ ఇవ్వలేని పవన్ కళ్యాణ్, 20 రోజుల డేట్స్ ఎలా ఇస్తాడు అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతి సరేసరి. అసలు ఈ సినిమా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే బాలీవుడ్ లో ‘జాట్’ అనే చిత్రం తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది లోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త మాత్రం ఇదే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తన మిత్రుడు కోసం సెట్ చేసి ఉంచాడట. ఒకపక్క ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేయడానికి తలమునకలు అయ్యున్న పవన్ కళ్యాణ్, బ్యాలన్స్ ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే ఇన్ని రోజుల సమయం తీసుకుంటున్నాడు. ఇక కొత్త సినిమాలను ఆయన ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
Also Read : క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా..కారణం ఏమిటంటే!