Kota Srinivasa Rao Legacy: ప్రముఖ లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) నేడు తన తుది శ్వాసని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ మొత్తం నేడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళ్లు అర్పించారు. చాలా మంది ఆయన ఇంటికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. వారిలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వారితో పాటు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్,రాజేంద్ర ప్రసాద్, బాబు మోహన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు కూడా ఉన్నారు. అయితే కోట శ్రీనివాస రావు గురించి మనకి తెలిసినవి కేవలం రెండే రెండు. ఒకటి అద్భుతమైన నటుడు, మరొకటి ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, మనసులో ఏదుంటే అది మాట్లాడే వ్యక్తిత్వం. ఈ రెండు కాకుండా కోట గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
అప్పట్లో మన సినీ పరిశ్రమ చెన్నై లో ఉండేది. ఇది అందరికీ తెలిసిందే. చెన్నై నుండి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చేందుకు చాలా ఏళ్ళ సమయం పట్టింది. అయితే ఆరోజుల్లో మన ఆంధ్ర ప్రదేశ్ సినీ పరిశ్రమ బలం ఏమిటో మద్రాసు ప్రభుత్వానికి తెలిసేలా చేశాడు కోట శ్రీనివాస రావు. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరపడడానికి ప్రభుత్వం ఆలోచన చేసేందుకు భీజం వేసిందే కోట శ్రీనివాస రావు. కోట శ్రీనివాస రావు చేసిన ఆ నిరాహార దీక్షకు ఇండస్ట్రీ మొత్తం తరళి వచ్చింది. ప్రభుత్వం ఒక అడుగు ముందుకు దిగి రావడం తో మన స్టార్ హీరోలందరూ కోట దీక్ష శిబిరానికి విచ్చేసి, ఆయన చేత నిమ్మరసం తాగించి దీక్షని విరమించేలా చేశారు. దీంతో ఆ ఈఏడాది నవంబర్ 30న హైదరాబాద్ లో మొక్కుబడిగా నైనా కొన్ని షూటింగ్స్ మొదలయ్యాయి. అందుకు కారణం కోట దీక్ష ఫలితమే. సినీ నటుడిగా ఉన్నత స్థాయికి చేరుకునన్ తర్వాత కోట శ్రీనివాస రావు ప్రజా సేవ చేసుకునేందుకు రాజకీయ అరంగేట్రం కూడా చేశాడు. తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే గా గెలుపొంది తన పరిధి మేర సేవలు అందించాడు