Chiru&pawan: మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తోందంటే చాలు అభిమానులకు పండగే. అదే చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల నుంచి మూవీ రిలీజ్ అవుతుందంటే పూనకాలే. వీరిద్దరూ ప్రస్తుతం వరుస చిత్రాలతో షూటింగ్‌ల్లో ఫుల్ బిజీగా మారారు. కాగా, చిరు, పవన్ కలిసి ఒకే తెరపై కనిపిస్తే స్క్రీన్ బద్దలవ్వాల్సిందే. వీరిద్దరు కలిసి గతంలో శంకర్‌దాదా జిందాబాద్లో కనిపించి కనువిందు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో వీరిద్దరు కలిసి నచిస్తారని ఊహాగానాలు వినిపించినా.. అసలు కుదరలేదు. అయితే, ఈ మెగాబ్రదర్స్ కలిసి నటించేందుకు సిద్ధమయినట్లు తాజాగా సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

చిరు నటిస్తోన్న 154వ సినిమా షూటింగ్‌ను నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే పవన్ నటించనున్నారంటూ టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే, అది ఎంత వరకు నిజం అన్నది స్పష్టత లెదు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ విషయంపై అభిమానులు విపరీతంగా చర్చించుకుంటున్నారు. త్వరలోనే పవన్ సినిమాలో కనిపించడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు. ఇందులో రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా, దీంతో పాటు గాడ్‌ఫాదర్, భోళాశంకర్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమాతోనూ బిజీగా మారారు.