Homeఎంటర్టైన్మెంట్Ramya krishna: ఆ సినిమాలో సౌందర్య పాత్ర నేను చేస్తే బాగుండనిపించింది!

Ramya krishna: ఆ సినిమాలో సౌందర్య పాత్ర నేను చేస్తే బాగుండనిపించింది!

Ramya krishna: కెరీర్​ ప్రారంభం నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ. కెరీర్​లో వచ్చే చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా తెరపై తిరుగులేని నటిగా ఇప్పటికీ వెలుగుతోంది. బాహుబలిలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత రిపబ్లిక్​, రొమాంటిక్​ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ఆడియన్స్​ను ఆకట్టుకుంది. ఇప్పుడు లైగర్​, బంగార్రాజు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్​లో చేయాలనుకుని కలగా మిగిలిపోయిన పాత్రలతో పాటు.. అనేక విశేషాలను ముచ్చటించింది. ఆ విశేషాలను తెలుసుకుందాం.

actress-ramya-krishna-revealed-about-her-dream-role

తన కెరీర్​లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ.. నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్ర ఎంతో స్పెషల్​ అని రమ్యకృష్ణ తెలిపారు. మరోవైపు, అమ్మోరు సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత.. ఏదో షూటింగ్​లో ఉండగా.. కొంత మంది మహిళలు వచ్చి తన కాళ్లకు మొక్కి వెళ్లడం ఇప్పటికీ గుర్తుందని ఆమె అన్నారు. చాలా మంది హీరోయిన్లు నీలాంబరి పాత్రను చేయాలని అనుకంటారని కాని, తనకు మాత్రం ఓ పాత్ర చేస్తే బాగుండని ఇప్పటికీ అనుపిస్తుంటుందని అన్నారు. అంతఃపురంలోని సౌందర్యలాంటి పాత్ర తన కెరీర్​లో ఉన్న కలగా పేర్కొన్నారు.

కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు ఆదర్శమని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటన్నింటిని నిలదొక్కుకుని ఎదిగిన క్రమం ఆమెకు అభిమానిగా చేసిందని తెలిపారు. ఆమెను కలవకపోయినా.. క్వీన్​ సిరీస్​లో ఆమె పాత్రను చేయడం ఆనందకరమని అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular