The Raja Saab Premiere Ticket: సంక్రాంతి వచ్చేసింది..స్టార్ హీరోల సినిమాలతో పాటు, యంగ్ హీరోల సినిమాలు కూడా మరో నాలుగు రోజుల తర్వాత థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి విడుదలయ్యే 5 సినిమాల్లో అత్యంత బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab Movie). ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ఈ సినిమాపై కావాల్సినంత హైప్ క్రియేట్ అవ్వలేదు. అందుకు కారణాలు ఏంటో తెలియదు కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎందుకో ఈ సినిమా విషయం లో పెద్ద నమ్మకం తో లేరు. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్ ని కొంతమేరకు సంతృప్తి పర్చింది. కానీ కావాల్సినంత హైప్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. అసలే హైప్ లేదని అభిమానులు బాధపడుతుంటే, నిర్మాతలు ప్రీమియర్ షోస్ కి పెట్టిన టికెట్ రేట్స్ ని చూసి బెంబేలెత్తిపోతున్నారు ఫ్యాన్స్.
Also Read: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన ‘అఖండ 2’ బయ్యర్లు..పరిస్థితి ఎలా ఉందంటే!
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ముందుగా జనవరి 8 వ తేదీన 6 గంటల నుండి మొదలు పెడదామని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టనున్నారు. ఈమేరకు ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని టికెట్ రేట్స్ పెంచుకునేందుకు నిర్మాతలు అనుమతులు కోరుతూ అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రీమియర్ షోస్ కి వెయ్యి రూపాయిల టికెట్ రేట్ కావాలట. ఓజీ లాంటి భారీ హైప్ ఉన్న సినిమాలకు ఇంత రేట్స్ మీద టికెట్ హాట్ కేక్స్ లాగా సేల్ అయ్యాయి. భవిష్యత్తులో ప్రభాస్ స్పిరిట్ మూవీ కి కూడా ఇలాంటి డిమాండ్ ఉంటుంది. కానీ ఎలాంటి హైప్ లేని ‘రాజా సాబ్’ చిత్రానికి ఇంత టికెట్ రేట్ పెట్టడం ఎందుకు?, ప్రభాస్ వీరాభిమానులు వెళ్లొచ్చు, కానీ ప్రభాస్ సినిమాని మొదటి రోజు మొదటి ఆట చూడాలని అనుకునే మూవీ లవర్స్ కూడా ఉంటారు.
Also Read: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
వాళ్ళు ఇంత డబ్బులు పెట్టి వెళ్లగలరా?, ఒక కుటుంబం మొత్తం ఈ సినిమాకు వెళ్లాలంటే కనీసం 6 వేలు ఖర్చు అవుతుంది. పది మంది ఉన్న కుటుంబ సభ్యులు అయితే 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెల మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుని, అభిమాని కూడా ఖర్చు చేయడానికి ఆలోచిస్తాడు, ఈ సినిమాకు ఇది చాలా పెద్ద మైనస్ కానుంది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఇదే రేంజ్ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆ రేంజ్ గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది చూడాలి. ఇక రెగ్యులర్ షోస్ విషయానికి వస్తే సింగల్ స్క్రీన్స్ 297 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ టికెట్ రేట్స్ 377 రూపాయిలు ఉండనున్నాయి.