Mana Shankara Varaprasad Garu : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shakara Varaprasad Garu) చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/ఆ సర్టిఫికేట్ ని జారీ చేశారు. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు ఉంటుందట. ఈ రన్ టైం తో వచ్చిన సినిమాలు అత్యధిక శాతం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పైగా తక్కువ రన్ టైం ఉండడం వల్ల, మల్టీప్లెక్స్ షోస్ ఇలాంటి పోటీలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి ఎక్కువగా షెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మూవీ టీం తో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోయిజాన్ని బ్యాలన్స్ చేస్తూ, ఇలాంటి పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులైందని, రౌడీ అల్లుడు , ఘరానా మొగుడు, అన్నయ్య కాలం నాటి మెగాస్టార్ చిరంజీవి ని మరోసారి వెండితెర పై చూసినట్టుగా అనిపించిందని, రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కి ఇదే పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరికొంతమంది అందిస్తున్న సమాచారం ఏమిటంటే, సినిమా యావరేజ్ రేంజ్ లో ఉందని, ఈ చిత్రాన్ని చూసినప్పుడు మనకు డాడీ, తులసి, అజిత్ విశ్వాసం సినిమాలు గుర్తుకొస్తాయని, కానీ సంక్రాంతికి గట్టు ఎక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమానే అని అంటున్నారు. ఈ చిత్రం లోని మెయిన్ హైలైట్ చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ అని కూడా అంటున్నారు.
వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, వీళ్లిద్దరు కలిసి చేసే అల్లరి మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాని పైకి లేపే ట్రాక్ కూడా ఇదేనట. ఓవరాల్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తారు కానీ, యూత్ ఆడియన్స్ నుండి మాత్రం ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రీమియర్ షోస్ వెయ్యకపోవడమే మంచిది అనే సలహాలు కూడా ఇస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రీమియర్ షోస్ ని అత్యధిక శాతం మంది చూసేది యూత్ ఆడియన్స్. వాళ్ళ నుండి ఇలాంటి సినిమాలకు పాజిటివ్ టాక్ ని ఆశించడం కష్టమే, కాబట్టి ప్రీమియర్ షోస్ కి దూరం గా ఉంటే మంచిదని అంటున్నారు.