https://oktelugu.com/

Pawan Kalyan : జపాన్ లో పవన్ కళ్యాణ్ మేనియా..’ఓజీ’ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఉందా..? చూస్తే మెంటలెక్కిపోతారు!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతుంది. జపాన్ దేశం లో అత్యంత ప్రేక్షకాభిమానం ని సంపాదించున్న కాజుకి కితామురా అనే నటుడు ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 15, 2024 / 05:07 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan :  బాహుబలి, #RRR సిరీస్ తర్వాత మన టాలీవుడ్ రేంజ్ నేషనల్ లెవెల్ ని దాటి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరింది. మన స్టార్ హీరోలందరికీ పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం జపాన్ లో 30 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రభాస్ సలార్ చిత్రానికి కూడా 23 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ ముగ్గురు హీరోల తర్వాత ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా గ్లోబల్ వైడ్ గా మంచి పాపులారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది గూగుల్ లో వెతికిన ఏకైక ఇండియన్ గా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఈ ఏడాది ఆయన రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతుంది. జపాన్ దేశం లో అత్యంత ప్రేక్షకాభిమానం ని సంపాదించున్న కాజుకి కితామురా అనే నటుడు ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఓజీ గురించి జపాన్ భాషలో పోస్టులు వేయగా, అవి తెగ వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ట్వీట్స్ ని షేర్ చేస్తూ జపాన్ లో కూడా ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాజుకి కితామురా ఒక్కడే కాదు, ప్రముఖ థాయిలాండ్ సూపర్ స్టార్ వితయ పాన్సీగరం కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

    మరో వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తర్వాత , బ్యాంకాక్ లో జరగబోయే రెండవ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు. జనవరి మొదటి వారం నుండి ఈ షెడ్యూల్ జరగనుంది. ఒకపక్క ఆయన ఉప ముఖ్యమంత్రి గా పరిపాలిస్తూనే, మరో పక్క ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నెల 22 వ తేదీతో ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి కాబోతుంది. ఈ సినిమాని మార్చి 28 వ తారీఖున విడుదల చేయబోతున్నామని నిర్మాత AM రత్నం ఇది వరకే అధికారిక ప్రకటన చేసాడు. కానీ అదే తేదీన ఓజీ నిర్మాతలు కూడా తమ సినిమాని విడుదల చేయడానికి పట్టుబడుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వస్తుంది అనే దానిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.