Allu Arjun: పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక సంధ్య థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేశారు. ఇక మొన్న అల్లు అర్జున్ ని కూడా ఇదే కేసు విషయంలో అరెస్ట్ చేసినప్పటికి ఆయనకు హైకోర్టు నుంచి మద్యంతర బెయిల్ మంజూరవ్వడంతో ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకి వచ్చాడు… ఇక ఆ తొక్కిసలాట లో రేవతి అనే మహిళలతోపాటు తన కొడుకు అయిన శ్రీతేజ్ కూడా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి వెంటిలేటర్ల మీదే ఉన్న ఆయన పరిస్థితి విషమం గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీతేజ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ హెల్త్ బులిటన్ రిలీజ్ చేసిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తనకు ఎలా ఉంటుందో చెప్పలేం అంటూ తమ కుటుంబ సభ్యుల్ని భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీతేజ్ కి ఇప్పుడు కనక ఏమైనా జరిగితే అల్లు అర్జున్ మీద నెగెటివిటి అనేది భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆయన మీద కొంతమంది విపరీతమైన నెగెటివ్ కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండడం అల్లు అర్జున్ తో పాటు అతని అభిమానుల్లో కూడా కలవరాన్ని రేపుతుంది.
ఇక ఏది ఏమైనా కూడా శ్రీ తేజ్ బాగుండి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయితే కొంతవరకు ఈ తొక్కిసలాట లో జరిగిన సంఘటనలు అందరూ మరిచిపోయే అవకాశమైతే ఉంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం అల్లు అర్జున్ మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి.
అలా కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ఆయన కొంతవరకు విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు తద్వారా అతనికి మరి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ లాంటి నటుడు పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపిస్తూ ముందుకు సాగుతుంటే ఇలాంటి సంఘటనల వల్ల ఆయన ఇమేజ్ అనేది భారీగా డ్యామేజ్ అవుతుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా శ్రీ తేజ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీదనే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు