Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Trivikram: త్రివిక్రమ్ వల్ల ఆ స్టార్ డైరెక్టర్ ను పక్కన పెట్టేసిన పవన్...

Pawan Kalyan Trivikram: త్రివిక్రమ్ వల్ల ఆ స్టార్ డైరెక్టర్ ను పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్… కారణమేంటంటే..?

Pawan Kalyan Trivikram: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ఆయన చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడంతో స్టార్ హీరోగా మారాడు. తన లాంటి నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి అభిమానుల కోరికను నెరవేర్చాడు. ఈ సంవత్సరం చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడంటూ వార్తలైతే వచ్చాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యలో ఎంట్రీ ఇచ్చి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తే అది రొటీన్ సినిమాగా మారుతుంది.

వైవిద్య భరితమైన సినిమాను అతను చేయలేడని డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకులతోనే ముందుకు సాగాలని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి సినిమాని పక్కన పెట్టేసాడు… ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కాబట్టి సురేందర్ రెడ్డి సైతం స్టైలిష్ మేకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక తన నుంచి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఎలాగైనా సరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి స్టార్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సురేందర్ రెడ్డి తీవ్రమైన ఆసక్తితో ఉన్నాడు… ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular