Pawan Kalyan Laid His Hands On The Director: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇంత మంది హీరోలు పుట్టుకొచ్చినా, యూత్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని మ్యాచ్ చేసిన వాడు ఇప్పటి వరుకు ఎవ్వరు రాలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆయన ఆఫ్ లైన్ క్యారక్టర్..ఎవ్వరికి తల వంచని తత్త్వం..ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యాలనే తత్వానికి కనెక్ట్ కానీ మనిషి అంటూ ఎవ్వడు ఉండదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఆశించిన స్థాయి ఫలితాలను చూడకపోయినా కూడా అటు సినిమాలు ఇటు పొలిటికల్ లైఫ్ ని బాలన్స్ చేస్తున్న సమయం లో ఆయన వెంట నిలబడింది కేవలం ఆయన అభిమానులు మాత్రమే..అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ డైరెక్టర్స్ కి విలువ ఇవ్వదు అని..అన్ని తనకే తెలుసు అనుకుంటాడు అని ,ప్రతి సినిమాలో ఆయన హస్తం ఉండాల్సిందే అని..అప్పట్లో ఖుషి , తమ్ముడు,బద్రి గుడుంబా శంకర్ వంటి సినిమాలలో కూడా ఆయన హస్తం ఉంది అని, డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని, అది పవన్ కళ్యాణ్ దగ్గర అసాధ్యం అని చెప్పుకొచ్చాడు..అప్పట్లో ఖుషి సెట్స్ లో ఆ చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య పై చెయ్యి చేసుకున్నారు అని కూడా చెప్పుకొచ్చాడు గీత కృష్ణ..ఆయన చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు..ప్రతి సినిమాకి స్టార్ హీరో అన్నప్పుడు తమ బాడీ లాంగ్వేజ్ కి తగట్టు గా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు డైరెక్టర్ కి సజెస్ట్ చెయ్యడం సహజమే అని..పవన్ కళ్యాణ్ అలా చేసిన సినిమాలు అన్ని ఎక్కువ శాతం భారీ విజయం సాధించినవే అని చెప్పుకొచ్చారు అభిమానులు.

Also Read: Venkatesh Fun with Bithiri Sathi : బిత్తిరి సత్తికి లైవ్ లోనే షాకిచ్చిన వెంకటేశ్
ఇక ఎస్.జె.సూర్య పై పవన్ కళ్యాణ్ చెయ్యి చేసుకోవడం అనేది పూర్తి అసత్య ప్రచారం అని..పవన్ కళ్యాణ్ కి ఉన్న అతి తక్కువ మంది స్నేహితులలో ఎస్.జె.సూర్య గారు ఒక్కరు అని..ఇప్పటికి పవన్ కళ్యాణ్ అతనితో ఎంతో అన్యోయంగా ఉంటారు అని, ఒక్కవేల వాళ్ళిద్దరి మధ్య అలాంటి గొడవలు జరిగి ఉంటె ఆ స్నేహం ఇన్ని రోజులు ఎలా దృడంగా ఉండగలదు అని అభిమానులు గీత కృష్ణ పై విరుచుకుపడుతున్నారు..పవన్ కళ్యాణ్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యడం కొత్త ఏమి కాదు అని..అన్యాయం గా ఒక్కడిని టార్గెట్ చేసి పబ్బం గడుపుకోవాలి అనుకున్న వాళ్ళందరూ మట్టికరుచుకుపోయారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు గీత కృష్ణ పై నిప్పులు చెరుగుతున్నారు..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మూడవ షెడ్యూల్ ని జూన్ 8 వ తేదీ నుండి జరుపుకోనుంది.

Also Read: Star Hero Missed Aadi Movie: షాకింగ్.. ఆది సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Recommended Videos
[…] […]
[…] […]