OG Movie : సైలెంట్ గా ఓజీ సినిమా పని పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్… ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..?

ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ అయితే తను అందుకోవాలని చూస్తున్నాడు... చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది...

Written By: NARESH, Updated On : May 16, 2024 4:00 pm

Do you know Pawan Kalyan remuneration for Oji movie

Follow us on

OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అతి కొద్ది మంది స్టార్ హీరోల్లో “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” ఒకరు..ఈయన సినిమాల ద్వారా సాధించిన క్రేజ్ కంటే కూడా ఆయన వ్యక్తిత్వంలో ద్వారా సంపాదించుకున్న జనాభిమానం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఆయన కోసం పడి చచ్చిపోయే అభిమానులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం ఆతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలతో పాటుగా పాలిటిక్స్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జరిగిన ఎలక్షన్స్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేశాడు.

ఇక అక్కడ ఆయన గెలుపు ఖాయమని ఇప్పటికే చాలా సర్వేలు కూడా తెలియజేశాయి. ఇక మొత్తానికైతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక జూన్ 4వ తేదీన ఏ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది తెలియబోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కోసం మరొక 20 రోజుల టైం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఓ జి సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఈ గ్యాప్ లో డబ్బింగ్ పూర్తి చేసి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన వన్ మంత్ తర్వాత నుంచి తన సినిమా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు అటు పాలిటిక్స్, ఇటు సినిమా రెంటింటిని సక్రమం గా కొనసాగిస్తూ వస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు దొరికిన కొద్ది సమయం కూడా సినిమా డబ్బింగ్ కోసం వాడుకుంటున్నాడు అంటే ఆయనకు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ కి మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ అయితే తను అందుకోవాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది…