Tollywood: ఈ సంవత్సరం ఇప్పటివరకు గడిచిన ఐదు నెలల్లో తెలుగు సినిమాల హవా ఏ మాత్రం కనిపించలేదు. సంక్రాంతి సినిమాలను మినహాయిస్తే ఆ తర్వాత నుంచి ఏ ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇక జూన్ 27వ తేదీన కల్కి సినిమాతో తెలుగు సినిమాల జాతర మొదలవుతుందనే చెప్పాలి. జూన్ చివర్లో కల్కి సినిమా ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతుంది. ఇక జూలై నెలలో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న “డబుల్ ఇస్మార్ట్” సినిమా రిలీజ్ అవుతుంది.
ఇక ఆ తర్వాత ఆగస్టు 15 వ తేదీన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే పుష్ప సినిమా మీద ఇప్పటికే ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుందనే అంచనాలైతే ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది క్లారిటీగా తెలియదు. ఇక ఆగస్టు ముగిసిన వెంటనే సెప్టెంబర్ చివరి వారంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో తానను తాను మరొకసారి పవర్ స్టార్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దసరా కానుకగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా రావడానికి రెడీగా ఉంది. ఇక నుంచి నెలకు ఒక పెద్ద సినిమా వచ్చి పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ సినిమాల హవా కొనసాగబోతుందనే చెప్పాలి… ఇక ఈ ఆరు నెలల్లో దాదాపు 50 వేల కోట్ల వరకు తెలుగు సినిమా బిజినెస్ జరగబోతున్నట్టుగా కూడా ట్రేడ్ పండితుల నుంచి సమాచారం అయితే అందుతుంది…