Pawan Kalyan Hits And Flops: తెలుగు ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని యూత్‌కు ఐకాన్‌గా మారిపోయాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసి వరుసగా ఏడు హిట్లు కొట్టిన ఘనత పవన్‌కళ్యాణ్‌కే చెందుతుంది.

గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి.. ఇలా వరుసగా ఇండస్ట్రీనే షేక్ చేసే హిట్లను పవన్ తన ఖాతాలో వేసుకున్నాడు. సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలు అయితే ప్రత్యేకంగా ట్రెండ్ సెట్ చేశాయి. ప్రస్తుతం ఉన్న అగ్రహీరోల్లో అందరికంటే వయసులో పెద్ద అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు వసూళ్లు కూడా టాక్‌తో సంబంధం లేకుండా బీభత్సంగానే వస్తుంటాయి.
Also Read: ప్రతిరోజూ ఎంతసేపు వాకింగ్ చేయాలి? ఏ సమయంలో చేయాలి?
హీరోగానే కాకుండా దర్శకుడిగానూ పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకున్నాడు. జానీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో అభిమానుల లెక్కలు తారుమారు అయ్యాయి. అయినా పవన్ తనలోని ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. జానీ తర్వాత గుడుంబా శంకర్‌కు ఆయనే దర్శకత్వం వహించాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

దర్శకత్వమే కాకుండా ఫైట్స్ కూడా పవన్ కంపోజ్ చేసిన సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాతో పాటు ఖుషి సినిమాకు పవన్ యాక్షన్ సన్నివేశాలను రచించాడు. ఖుషి తర్వాత జల్సా సినిమాతో చాన్నాళ్ల తర్వాత పవన్ పవర్‌ఫుల్ హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా పవన్ సాధించాడు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో సినిమాలను తగ్గించాడు. ఇటీవల మళ్లీ అజ్ఞాతవాసి సినిమాతో మళ్లీ వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమా పవన్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. భీమ్లానాయక్ విడుదలకు సిద్ధంగా ఉండగా హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలతో పాటు హరీష్‌శంకర్, సురేందర్‌రెడ్డి సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు కలెక్షన్‌లు రావడం అతడికున్న పవర్‌ఫుల్ ఫాలోయింగ్‌ను చాటిచెప్తున్నాయి.
Also Read: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?
[…] Also Read: అక్కడమ్మాయి.. ఇక్కడ అబ్బాయి నుంచి భీమ… […]
[…] Murali Mohan: చలన చిత్ర రంగంలో మురళీమోహన్ ఓ విలక్షణమైన నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించి మంచి మార్కులు కొట్టేసే ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. సినిమా ప్రారంభమై పూర్తయ్యే వరకు తమ పాత్ర ఉంటుందో లేదో కూడా ఎవరికి అంతుచిక్కదు. అలాంటి ఓ బాధాకరమైన సన్నివేశాన్ని సైతం మురళీమోహన్ జీవితంలో చూడవచ్చు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో పాత్రకు జీవం పోసిన ఘనత ఆయన సొంతం. అలాంటి మురళీమోహన్ కూ ఓ ఘటన చేదు అనుభవమే మిగిల్చింది. […]