Hari Hara Veera Mallu OTT Version: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన చిత్రాల్లో ఒకటిగా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) నిలిచిపోయింది. పవన్ సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కనీసం మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయే రేంజ్ వసూళ్లు వస్తుంటాయి. కానీ ఆయన కెరీర్ లో కేవలం మొదటి రోజు తప్ప, రెండవ రోజు నుండి అతి దారుణంగా పడిపోయి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. అంతకు ముందు జానీ, పంజా, అజ్ఞాతవాసి చిత్రాలకు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఈ సినిమాకు ఈ రేంజ్ ఫలితం రావడానికి ప్రధాన కారణం సెకండ్ హాఫ్. సమయం లేకపోవడం వల్లనో, లేకపోతే బడ్జెట్ లేకపోవడం వల్లనో తెలియదు కానీ, VFX క్వాలిటీ అత్యంత దారుణంగా ఉన్నాయి. పాత కాలం లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో కనిపించే VFX చాలా వరకు బెటర్ అనుకోవచ్చు.
Also Read: ఓటీటీ లోకి ‘మహావతార్ నరసింహా’..నిర్మాత సంచలన ప్రకటన!
అందుకే ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆ రేంజ్ లో రిజెక్ట్ చేశారు. సినిమా థియేట్రికల్ రన్ కూడా గత వారం తో దాదాపుగా ముగిసిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధం గా ఉన్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆగష్టు 15 న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పందం కంటే ముందుగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇస్తే 15 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఆఫర్ పెట్టడం తో నిర్మాతలు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం లోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ఈ ఓటీటీ వెర్షన్ లో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ లో చూడని కొన్ని సన్నివేశాలతో పాటు, అప్డేట్ చేయబడిన VFX కూడా జత చేయనున్నారని టాక్.
Also Read: ‘ఓజీ’ నుండి అభిమానులకు మరో భారీ సర్ప్రైజ్..ఇది మామూలు ప్లానింగ్ కాదు!
థియేటర్స్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రానికి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. గుంటూరు కారం ఆ కోవకు చెందిన సినిమానే. కాబట్టి ‘హరి హర వీరమల్లు’ ని కూడా ఆడియన్స్ అదే విధంగా ఆదరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఫ్యాన్స్ ఆడియన్స్ ఆదరిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఆ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుంది అనేది.