Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు అనగానే పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హరీష్ తో సినిమా అంటే.. అభిమానులకు పండగే. ఎందుకంటే.. ఒక అభిమాని పవన్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. హరీష్, పవన్ తో సినిమా చేస్తే అలా ఉంటుంది. అందుకే, వీరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు తాజాగా ఈ సినిమా పై పవన్ నుంచి క్లారిటీ వచ్చింది.

క్లారిటీ అంటే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల్లో అన్నమాట. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే రిలీజ్ విషయానికి వస్తే.. 2023 సంక్రాంతికి హరీష్ శంకర్ – పవన్ తమ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ప్లేస్ లో ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారట. ఆమెను తీసుకోవడానికి కారణం.. సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ అట. అన్నట్టు ఈ చిత్రానికి ‘భగత్ సింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మరి ఈ టైటిల్ పెడితే.. మాస్ లో ఫుల్ ఊపు వస్తోంది. పైగా ఈ సినిమాలో వెరీ పవర్ ఫుల్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ముఖ్యంగా పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. అంటే.. తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్ల పై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కోణంలో కథ సాగుతుంది.
Also Read: Priya Prakash Varrier: ప్చ్ క్రేజీ బ్యూటీ… అంతా పడిపోయాక తత్వం బోధపడితే ఎలా ?
కథ పాతది అయినా, కథనం చాలా కొత్తగా ఉంటుందని.. పవర్ స్టార్ ఈ సినిమాలో ముందెన్నడూ కనిపించని లుక్ లో చాలా గ్రాండ్ గా కనిపించబోతున్నాడని హరీష్ శంకర్ చెబుతున్నాడు. పైగా పవన్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ.. మరి సినిమా ఎలా ఉంటుందో.. ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి.