Harihara Veeramallu review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు (Harahara Veeramallu) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈనెల 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను కూడా శరవేగంగా చేపట్టడానికి సినిమా యూనిట్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు… ఇక సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ రావడం పవన్ కళ్యాణ్ తో పాటు అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 17వ శతాబ్దం నాటి మొగల్ సామ్రాజ్యంలో జరుగుతున్న కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో నటించి మెప్పించాడనే వార్తలైతే వస్తున్నాయి… సెన్సార్ బోర్డు వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం ఈ సినిమా మొదట్లో కొంచెం డల్ గా స్టార్ట్ అయినప్పటికీ ఫ్రీ ఇంటర్వెల్ ముందు నుంచి పుంజుకుంటుందట…ఇక ఇంటర్వెల్ లో ఒక భారీ ట్విస్ట్ ని ఇచ్చి సినిమాని మలుపు తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెందిన విరోచిత పోరాటం ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ‘ ఎల్లమ్మ’ సినిమాకి ‘కాంతార ‘ మూవీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?
సెకండాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడట. ఇక మొత్తానికైతే కత్తి పట్టి యుద్ధం చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తెగువ చూపించారంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు… ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా చేయలేదు. కాబట్టి ఈ సినిమా అతనికి చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా మొగల్ సామ్రాజ్యంలో భయాన్ని పుట్టించిన ఒక వీరుడి వీర గాధని పవన్ కళ్యాణ్ చాలా ఓన్ చేసుకొని మరి నటించి మెప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఒక మూడు సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నాయట… క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెబుతున్నారు.
Also Read: అవతార్’ బడ్జెట్ ని దాటేసిన హిందీ ‘రామాయన్’ మొదటిభాగం బడ్జెట్..ఎంతంటే!
విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీజీ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయిందని పవన్ కళ్యాణ్ ని చూస్తే అతని అభిమానులకు పూనకాలు రావడం పక్కా అంటూ సెన్సార్ వాళ్ల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం మరి కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది…