https://oktelugu.com/

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’ లో ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్..ఇదే స్టోరీ నిజమైతే బాలీవుడ్ షేక్ అవ్వుధి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28 వ తారీఖున విడుదల కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 08:02 PM IST
    Follow us on

    Hari Hara Veeramallu:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28 వ తారీఖున విడుదల కాబోతుంది. నేడు విజయ దశమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ని మూవీ టీం విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు విడుదలైన హరి హర వీరమల్లు పోస్టర్స్ లో ఇది ది బెస్ట్ గా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

    మొఘల్ సామ్రాజ్యం లో దోపిడీలు, దౌర్జన్యాలు విచ్చల విడిగా కొనసాగుతుంటాయి. అలా ఇష్టారాజ్యం గా జరుగుతున్న రోజుల్లో ధనవంతులు దగ్గర డబ్బులు దోచేసి పేదలకు పంచే రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అప్పట్లో కోహినూర్ డైమండ్ వివిధ రాజ్యాలకు చెందిన రాజుల చేతులు మారుతూ ఉండేవి. అలా ఢిల్లీ సామ్రాజ్యానికి చెందిన ఒక రాజు చేతికి వెళ్తుంది కోహినూర్ వజ్రం. అతను దానిని బ్రిటీష్ వారికి అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న వీరమల్లు, ఆ వజ్రాన్ని దొంగిలిస్తాడు. తన అనుమతి లేకుండా గాలి కూడా రానటువంటి తన కోటలోకి ప్రవేశించడమే కాకుండా, ఎంతో విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేస్తాడా అని ఢిల్లీ రాజు (ఔరంగ జేబ్) పగతో రగిలిపోతాడు. వీరమల్లు ని పట్టుకొని తన వద్దకు తీసుకొని రమ్మని తన సైన్యాన్ని పంపిస్తాడు. వీరమల్లు కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేస్తారు, అతను ఉంటున్న ప్రాంత ప్రజలను ఔరంగ జేబ్ సైన్యం చిత్ర హింసలు పెడుతుంది, కానీ వీరమల్లు ఎక్కడ ఉన్నాడు అనే ఆచూకీ మాత్రం తెలపరు.

    అయితే జనాలను తన కోసం ఇంతలా హింసిస్తున్నారని తెలుసుకున్న వీరమల్లు ఔరంగ జేబ్ సైన్యం తో పోరాడేందుకు ముందుకు వస్తాడు. వీరమల్లు కి ఔరంగ జేబ్ సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం నడుస్తుంది. వీరమల్లు ఔరంగ జేబ్ సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు. చివరికి ఒంటరిగా ఔరంగజేబ్ పై దండయాత్రకు ఢిల్లీ కి పయనం అవుతాడు. ఇక్కడితో ‘హరి హర వీరమల్లు’ పార్ట్ 1 ముగుస్తుందట. ఇక రెండవ భాగం లో వీరమల్లు, ఔరంగజేబ్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారట. మొదటి భాగంలో మచిలీపట్టణం పోర్ట్ ఫైట్, చార్మినార్ ఫైట్ సీన్, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం, అడవిలో పులితో పోరాడే పోరాట సన్నివేశం, క్లైమాక్స్ 20 నిమిషాలు వచ్చే ఫైట్, ఇలా అన్నీ కూడా వేరే లెవెల్ లో వచ్చాయని టాక్.

    Tags