Viswam Movie: చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లేక, కెరీర్ లో ఒడిదుడుగులు ఎదురుకుంటున్న మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్ గా విశ్వం చిత్రంతో మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమా ద్వారా మన ముందుకు వచ్చాడు. తన మార్క్ కామెడీ టైమింగ్ ని జోడించి, ఒక సరికొత్త స్పై కథ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రెస్పాన్స్ ఆడియన్స్ నుండి చాలా డీసెంట్ గా వచ్చింది. మొదటి రోజు తొలి షోస్ కి జనాలు లేక అనేక ప్రాంతాలలో షెడ్యూల్ చేసిన షోస్ ని రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ సాయంత్రం షోస్ నుండి పికప్ అయిన ఈ చిత్రం ‘దసరా’ రోజు ఇరగకుమ్మేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాట్నీ షోస్ నుండి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. A సెంటర్స్ నుండి C సెంటర్స్ వరకు ప్రతీ థియేటర్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోయింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి, మామూలు టాక్ తో ఇంత మంచి వసూళ్ళు వచ్చాయంటే, అందుకు కారణం కచ్చితంగా గోపీచంద్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన గతంలో చేసిన సినిమాలు కారణంగా ఆడియన్స్ లో గోపీచంద్ చిత్రం అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయమే ఇంత క్లిష్టమైన సమయంలో కూడా గోపీచంద్ కి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చేలా చేసింది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం విడుదలకు ఒక రోజు ముందు రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం విడుదలై తెలుగు, తమిళ భాషల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ దసరా పండుగ రోజు ఆడియన్స్ కి రజినీకాంత్ సినిమా కంటే గోపీచంద్ సినిమానే ఎక్కువని, ఈరోజు వచ్చిన వసూళ్లను చూస్తే అర్థమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో నేడు ‘దేవర’ చిత్రం తో పాటు ‘విశ్వం’ చిత్రానికి కూడా ప్రతీ సెంటర్ లో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. ఇది చిన్న విషయం కాదు. బుక్ మై షో లో విశ్వం టికెట్ సేల్స్ అమ్మకాలు, రజినీకాంత్ వెట్టియాన్ సినిమాతో సమానంగా వేశారు జరిగాయట. కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం నేటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రేపు ఆదివారం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ రేపటికి కూడా అదిరిపోయాయి. ఇదే ఊపులో ముందుకు దూసుకెళ్తే ఈ చిత్రం కమర్షియల్ గా డబుల్ బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. కేవలం ఒక్క రెండవ రోజే ఈ చిత్రానికి బుక్ మై షో ద్వారా 45 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్లి ఆగుతుంది అనేది.