Hari Hara Veera Mallu Minus Points: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో తన ఎంటైర్ కెరియర్ లో తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. హరిహర వీరమల్లు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. కానీ సినిమా టాక్ విషయంలోనే కొంతమంది కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమా మీద కొంతవరకు నెగెటివ్ గా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ మంచి అంచనాలు పెట్టికున్నప్పటికి దర్శకులు మారడం వల్ల ఈ సినిమాకి భారీగా మైనస్ అయిందనే చెప్పాలి. క్రిష్ కనక ఈ సినిమాను తెరకెక్కించుంటే సినిమా బాగుండేదని చాలామంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
నిజానికి జ్యోతి కృష్ణ కి దర్శకుడిగా పెద్దగా అనుభవం అయితే లేదు. ఆయన చేసిన ఒకటి రెండు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ని హ్యాండిల్ చేయలేకపోయాడు. మరి ఏది ఏమైనా కూడా క్రిష్ జాగర్లమూడి రాసుకున్న కథ అయితే బాగుంది. మరి దాన్ని విజువల్ గా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయిపోయాడు… ఏ సినిమా అయిన సరే బాగుండాలి అంటే అందులోని కోర్ ఎమోషన్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది… సెకండ్ హాఫ్ చాలా స్లోగా వెళ్లడం సినిమా ప్రేక్షకుడిని ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోవడం సినిమాకి భారీ మైనస్ గా మారింది… చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి అతని అభిమానులకు కొంతవరకు నచ్చుతోంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ చూపించడంలో ఆయన మరోసారి సక్సెస్ సాధించాడు.
ఆయన రేంజ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఓవరాల్ గా సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉండాలో అవన్నీ ఉన్నప్పటికి వాటిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద డెలివరీ చేయడంలో మాత్రం కొంత వరకు గాడి తప్పాడు… పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అతనికి ఇప్పుడు చాలా వరకు యూజ్ అయిందనే చెప్పాలి…