Hari Hara Veera Mallu Review: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవెల్లో ప్రీమియర్ షోస్ పడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ సినిమాను చూసేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎంతమేరకు ఆడియన్స్ ని అలరించిందో చూద్దాం.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
కథ ఏంటంటే... హరి హర వీరమల్లు ఒక వజ్రాల దొంగ. వజ్రాలను దోచేయడం, వాటిని అమ్మేయడం, వచ్చిన డబ్బుని జనాలకు పనిచేయడం, ఇలా ఒక రాబిన్ హుడ్ తరహా అన్నమాట. అయితే ఒక నవాబు వజ్రాల దొంగతనాల విషయం లో ఇతని నైపుణ్యం తెలుసుకొని, కుతుబ్ షా మనుషుల వద్ద ఉన్న ఖజానా ని దోచేయడం కోసం వీరమల్లు ని తన వద్దకు పిలిపించుకుంటాడు. దోచుకొచ్చిన వజ్రాల విషయం లో వాటాలు కూడా మాట్లాడుకుంటారు. కానీ వీరమల్లు, హీరోయిన్ నిధి అగర్వాల్ తో కలిసి ఖజానా తో పారిపోవాలని చూస్తారు, ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత కథలో ఎలాంటి మలుపులు వచ్చాయి?, ఔరంగజేబు కి వీరమల్లు కి మధ్య ఎందుకు వైరం వచ్చింది ? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ చూస్తే.. ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది.. ఇక ఆ తర్వాత మచిలీపట్టణం పోర్ట్ ఫైట్ సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, అదే విధంగా ఇంటర్వెల్ బ్లాక్స్ నడిపించేస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ కొన్ని సన్నివేశాల్లో గెడ్డం లేకుండా కనిపిస్తాడు. మరి కొన్ని సన్నివేశాల్లో గడ్డం తో కనిపిస్తాడు. ఇవి చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ సమయం లో షూటింగ్ చేసిన సన్నివేశాలకు, రీసెంట్ గా షూట్ చేసిన సన్నివేశాలకు బాగా తేడా తెలిసిపోతుంది. కానీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ గా సాగిపోతుందని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎటు నుండి మొదలై ఎటు వైపు వెళ్లి ఆగుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ బాగానే ఉందిలే పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ VFX మాత్రం అత్యంత నాసిరకంగా అనిపించాయి. ముఖ్యంగా చివరి పది నిమిషాలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నమాట. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ నటన తో ఈ సినిమాని కాపాడేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశారు. కీరవాణి కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా అద్భుతమైన మ్యూజిక్ తో అడగొట్టేసాడు. ఓవరాల్ గా సినిమా బీలో యావరేజ్ తో యావరేజ్ ఫీలింగ్ ని ఇస్తుంది.
రేటింగ్ : 2 /5