Today 24 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఆషాడం అమావాస్య కావడంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే పెద్దల సలహా తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు తమ ప్రాజెక్టుల కోసం ఇతరుల సలహాలు అడుగుతారు. అనవసరంగా ఖర్చులు చేయకుండా ఉండాలి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం స్నేహితుల సహాయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఇతరులతో సంభాషించేటప్పుడు తొందరపడి వాగ్వాదానికి దిగకూడదు. వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. డబ్బులు పొదుపు చేయడం నేర్చుకోవాలి. లేకుంటే తీవ్రంగా ఇబ్బందులు నేరుకునే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇష్టమైన వ్యక్తుల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పరిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంబంధాలు మెరుగుపరుచుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల సహాయంతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు.. తోటి ఉద్యోగుల సహాయంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. సమయం వృధా చేయకుండా కొన్ని పనులను ఈరోజు పూర్తి చేయాలి. వాయిదా వేయడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ సమయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు అనుకున్న దానికంటే విజయం పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు తాము అనుకున్నా లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారుల సంపాదన పెరుగుతుంది. వీరు కొత్త పనిని ప్రారంభించుకుంటారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఇతరులకు అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. స్నేహితులతో కుల్లాసంగా గడుపుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల కోసం వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా మీ పనులకు అడ్డంకులు సృష్టిస్తే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదన రావచ్చు. డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : శుభ కార్యాలయాల్లో పాల్గొంటారు. అవివాహితులకు ప్రతిపాదనలు వస్తాయి. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాతోనే ముందుకు వెళ్లాలి. ఉద్యోగులు గతంలో అనుకున్న కొన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరితో సంయమనం పాటించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈరోజు వ్యాపారులు తీసుకుని నిర్ణయాలతో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అంకితభావంతో పనిచేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈరోజు కొత్త ఆలోచనలతో ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. సమయం వృధా చేయకుండా పనులను పూర్తి చేసుకోవాలి. వ్యాపారులు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. తోటి వారి సహాయంతో కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. భాగస్వాముల వద్ద రహస్యాలను బయటపెట్టకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అంతర్గత విషయాలను ఇతరులతో చర్చించకూడదు. ఆర్థిక విషయాలపై ప్రత్యేక చర్చ పెడతారు. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కొత్త పనులు చేపడుతారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు గతంలో చేపట్టిన లక్ష్యాలను ఈరోజు పూర్తి చేస్తారు. మనసులోకి ప్రతికూల ఆలోచనలను రానీయకుండా చూడాలి. అధికారుల నుంచి ఉద్యోగులకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా పనిని చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగుల సాయంతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేసుకోవాలి.