వృత్తి పరంగా ఆయన ఒక ప్రముఖ డాక్టర్, నిత్యం పేషంట్లతో బిజీ లైఫ్..
అన్నిటికీ మించి వేలమంది పేషంట్ల జీవితాల్లో వెలుగులు నింపాననే సంతృప్తి..
అయినా ఇటు క్రీడా లోకంలోనూ ఆయన తన ఘనమైన సంతకాన్ని పెట్టారు..
ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు, డాక్టర్లకు మార్గదర్శిగా నిలిచారు. ఆయనే ఫేమస్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ : జాన్ వాట్స్.
ఆయన పేషంట్లకే కాదు, ఆర్చరీలో కూడా సూపర్ హీరో అయ్యారు. ‘తెలంగాణ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2022’ పోటీల్లో డాక్టర్ : జాన్ వాట్స్ అర్చరీలో అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఆయన రజిత పతకం సాధించారు. ఆర్చరీలో డా: జాన్ వాట్స్ (Dr. John Watts) ఈ పతాకం సాధించిన విధానం చూసి, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ పలువురు ప్రముఖులు ఆయన పై పొగడ్తల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
అసలు ధనుర్విద్య అంటేనే అతి ప్రాచీన క్రీడ. పురాణ యుగపు కథానాయకుల నుంచి నేటి డా: జాన్ వాట్స్ గారి దాకా ఈ విలువిద్య కొనసాగుతూనే ఉంది. అంత గొప్ప చరిత్ర ఉంది విలువిద్యకి. ఇలాంటి అర్చరీలో గొప్ప నైపుణ్యం ప్రదర్శించి.. ప్రశంసల పరంపరను అలవోకగా కొనసాగించడం నిజంగా అది డాక్టర్: జాన్ వాట్స్ (Dr. John Watts) గొప్పతనమే. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టాప్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ గా ఉంటూ ఈ విజయం సాధించడం గొప్ప విషయమే కాదు, అరుదైన విజయం కూడా.
డాక్టర్ : జాన్ వాట్స్ ఇప్పటికే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ గా ఎన్నో అవార్డులను & రివార్డులను పొందారు. అయినా, తన పేషంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే తనకు నిజమైన అవార్డు & రివార్డు అని ‘జాన్ వాట్స్’ చెబుతూ ఉంటారు. వృత్తి పై అంత గొప్ప నిబద్ధత ఉన్న డాక్టర్, ఆర్చరీ క్రీడా అభిమానుల హృదయాల్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఒక్క ఆయనకే చెల్లింది. ఆర్చరీ క్రీడా రంగంలో డాక్టర్ : జాన్ వాట్స్ (Dr. John Watts) ఇలా మరో ఎన్నో పురస్కారాలు అందుకోవాలని క్రీడా అభిమానులు కోరుకుంటున్నారు.