Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేసిన సెన్సేషన్ అయిపోతుంది. రాజకీయాల్లో ఆయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమాల పరంగా కూడా అదే రేంజ్ ఉందని రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ నుండి విడుదలైన ‘మాట వినాలి’ పాటని చూస్తే అర్థం అవుతుంది. చాలా నార్మల్ గా అనిపిస్తున్న ఈ ఫోక్ సాంగ్ వేరే హీరో పాడుంటే ఇంతటి రెస్పాన్స్ వచ్చేది కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ పాడే లోపు రోజురోజుకి ఈ పాటకు లక్షల కొద్దీ లైక్స్ తో పాటు, మిలియన్ల కొద్దీ వ్యూస్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాటకి 26 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం రెండు నిమిషాల పాట, పెద్దగా సంగీతం కూడా లేదు, డ్రమ్స్ కి మాత్రమే పని చెప్పారు, అలాంటి పాటకు ఇలాంటి రెస్పాన్స్ రప్పించడం కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం.
ఈ పాటకు ప్రముఖ రచయిత పెంచల్ దాస్ సాహిత్యం అందించాడు. మొదట్లో కేవలం ఈ పాటని పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే అభిమానులు చూసారు కానీ, ఆ తర్వాత మెల్లగా అందులోని మాటలను అర్థం చేసుకొని పెంచల్ దాస్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. మా అభిమాన హీరోకి ఇంత అద్భుతమైన పాటని రాసినందుకు కృతఙ్ఞతలు అంటూ అభిమానులు ఆయనకీ సోషల్ మీడియా ద్వారా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు. అయితే గతంలో పెంచల్ దాస్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వైరల్ చేశారు. ఆయన అందించిన సాహిత్యంలో గొప్ప స్ఫూర్తి ఉండడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్, వెంటనే అతన్ని అభినందించి, ఇంటికి పిలిచి భోజనం పెట్టి, కాసేపు ఆయనతో సరదాగా మాట్లాడి, చేతిలో లక్ష రూపాయిల చెక్ ని అందించాడట.
అప్పటికే నిర్మాతలు పెంచల్ దాస్ కి రెమ్యూనరేషన్ రూపం లో డబ్బులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడంటే ఆయన మనసు ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సాహిత్య కళాకారులను ప్రోత్సహించి జనం ముందుకు తీసుకొని రావడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు ఉంటాడు. గతంలో భీమ్లా నాయక్ సినిమా కోసం కిన్నెర కళాకారుడు మొగిలయ్య ని తెలుగు ప్రజలకు పరిచయం చేసాడు. అంతే కాదు యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ని అందేలా చేసాడు. ఇప్పుడు పెంచల్ దాస్ కి కూడా ‘మాట వినాలి’ పాట ద్వారా అలాంటి గుర్తింపుని తెచ్చిపెట్టాడు. ఈ పాట తర్వాత ఆయన కి టాలీవుడ్ అవకాశాల జోరు ఊపందుకుంటుందో లేదో చూద్దాం. ఇది ఇలా ఉండగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.