Pimples: మొటిమల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇక ఒకసారి మొహం మీద మొటిమలు వస్తే పోవడం కూడా కష్టమే. లేదంటే వాటి తాలూకా మచ్చలు ఉంటాయి. దీని వల్ల మొహం మొత్తం పాడు అవుతుంది. అందుకే చాలా మంది ఈ పింపుల్స్ పోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వైద్యుల సలహా తీసుకుంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో కూడా ఈ పింపుల్స్ వస్తాయి. ఏదైనా ప్రత్యేక సందర్భానికి ముందు ముఖంపై మొటిమలు కనిపించడం ఒక సాధారణ సమస్య. ముఖంపై మొటిమలు కనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. పెళ్లి, పెద్ద ఈవెంట్ లేదా ఇంటర్వ్యూ ముందు ఒత్తిడి ఉంటుంది. మీ ప్రత్యేక రోజు ముందు మీ ముఖంపై మొటిమలు కనిపిస్తున్నాయా? అయితే ముఖంపై మొటిమలు ఎందుకు వస్తాయి? వాటి నివారించడానికి ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
టెన్షన్
ఒత్తిడి పెరిగినప్పుడు, శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తికి దారితీస్తుంది. అదనపు నూనె, మురికి పేరుకుపోవడం వల్ల మొటిమల సమస్య మొదలవుతుంది. ఇది కాకుండా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఫేషియల్
ప్రత్యేక రోజు కోసం అమ్మాయిలు అనేక రకాల సన్నాహాలు చేస్తారు. ప్రత్యేక రోజుకి ముందు అమ్మాయిలు ఫేషియల్ చేయించుకుంటారు. కొన్నిసార్లు స్క్రైబ్స్, రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మం చికాకు కలిగిస్తుంది. ఇది ముఖంపై మొటిమల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారం
ప్రత్యేక రోజుల్లో మొటిమలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రత్యేక రోజుకి ముందు మీ ముఖంపై ఎలాంటి కొత్త చర్మ సంరక్షణ ఉత్పత్తులను అప్లే చేయవద్దు. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. నీరు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.
నడవండి
ప్రత్యేక రోజు ముందు, మీరు తప్పనిసరిగా పార్క్‌లో నడవడం అలవాటు చేసుకోండి. ప్రకృతి దగ్గర నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల ముఖంలో మెరుపు కూడా కనిపిస్తుంది. సో మీరు మంచి గ్లో తో మెరిసిపోతారు.
ఆహారం, పానీయం
ప్రత్యేక రోజు ముందు, మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆయిల్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి.
మీ ముఖాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు కడగాలి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల లేదా కార్యాలయం నుంచి వచ్చిన తర్వాత ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి. దీని కోసం శుభ్రమైన నీరు, సాధారణ సబ్బు లేదా వాటర్ బేస్డ్ ఫేస్ వాష్ వాడాలి. అయితే, సబ్బు తరచుగా ముఖం పొడిబారడానికి కారణమవుతుంది అని గుర్తు పెట్టుకోండి. మొటిమలను ఎప్పుడూ గిల్లవద్దు. ఇలా చేయడం వల్ల సమస్య పెరుగుతుంది. మొటిమలు వస్తే మాత్రం ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోండి. అంతేకాదు గుడ్లు, నాన్ వెజ్, నూనె పదార్థాలకు కూడా దూరంగా ఉండండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..