Gabbar Singh Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తల్చుకుంటే ఏదైనా చేయగలరు అని మరోసారి ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ తో నిరూపించారు. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఒక స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి హంగామా ఉంటుందో, అలాంటి హంగామా రీ రిలీజ్ కి చేసి చూపించారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ప్రతి ఒక్కరు ఈ సినిమా వసూళ్ల గురించే చర్చ. పవర్ స్టార్ స్టార్ స్టేటస్ కి కొలమానం అనేదే లేదు అని ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు ట్రేడ్ పండితులు. సాధారణంగా పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తే జనాలు క్యూ కడుతుంటారు. ఎందుకంటే నేటి తరం ఆడియన్స్ ఆ సినిమాలను థియేటర్స్ లో అప్పట్లో సగానికి పైగా చూసి ఉండరు కాబట్టి. కానీ ‘గబ్బర్ సింగ్’ చిత్రం గత దశాబ్దం లోనే విడుదలైంది. నేటి తరం పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం అప్పుడే థియేటర్స్ లో చూసేసి ఉంటారు. అయినా కూడా ఈ చిత్రానికి ఇలాంటి ఓపెనింగ్ వసూళ్లు ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 3.4 కోట్ల రూపాయిలు రాగ, సీడెడ్ నుండి కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇవి ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 47 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పశ్చిమ గోదావరి జిల్లాలో 39 లక్షలు, కృష్ణ జిల్లాలో 39 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 55 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. గుంటూరు జిల్లాలో అయితే ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి. కేవలం గుంటూరు సిటీ నుండే 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, జిల్లా మొత్తానికి కలిపి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఈ చిత్రానికి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా కర్ణాటక ప్రాంతం నుండి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు నుండి 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 20 లక్షలు రాబట్టింది. ఇండియా లో ఈ స్థాయి విద్వంసం సృష్టించిన ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. అక్కడ ‘సరిపోదా శనివారం’ చిత్రం అద్భుతంగా ఆడడమే అందుకు కారణమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయినప్పటికీ కూడా గబ్బర్ సింగ్ ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డు నెంబర్ ని నెలకొల్పింది కానీ, అనుకున్న స్థాయి వసూళ్లు అయితే రాలేదు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలిపి చూసుకుంటే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మహేష్ బాబు నటించిన మురారి చిత్రానికి కేవలం 5 కోట్ల 30 లక్షలు మాత్రమే మొదటి రోజు వచ్చాయి.