Santhossh Jagarlapudi: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణిలో సాగే కథలు వచ్చేవి..ప్రేక్షకులు వాటిని చూస్తూ ఆనందపడుతూ ఆ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. ప్రతి దర్శకుడు తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అందుకే కొత్తగా వచ్చే దర్శకుల దగ్గర కొత్త కాన్సెప్ట్ లు ఉండడమే కాకుండా వాళ్ళు చేసే సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవాలని కూడా చూస్తున్నారు. ఈరోజుల్లో ఏ దర్శకుడి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో ఎవరు చెప్పలేకపోతున్నారు. కారణం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం రావడం ఒక్కటే బ్యాలెన్స్ వచ్చిందంటే స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందడానికి చాలావరకు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘సుబ్రహ్మణ్య పురం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు ‘సంతోష్ జాగర్లపూడి’… మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత నాగశౌర్యతో చేసిన లక్ష్య సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికీ దర్శకుడిగా మాత్రం ఆయన ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు.
ఇక పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అనే ఒక సూత్రాన్ని బలంగా నమ్మే సంతోష్ జాగర్లపూడి ప్రస్తుతం సుమంత్ తో మహేంద్రగిరి వారాహి అనే మరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని దర్శకుడు తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఒక సినిమా మీద ఆయన డెడికేషన్ ఎంతలా ఉంటుంది అంటే ఆయనకి రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగి కాలికి పెద్ద గాయం తగిలింది.
మరో రెండు రోజుల్లో ఔట్ డోర్ సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ భయపడకుండా సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేయకుండా ఎవ్వరినీ పానిక్ అవ్వకుండా ఔట్ డోర్ లోకేషన్ కి వెళ్లి వీల్ చైర్ లో కూర్చోని మరి డైరెక్షన్ చేసి సినిమాను సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇంతటి డెడికేషన్ తో కూడా దర్శకులు ఉంటారా అని సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా ఆయన అరుదైన ఘనతను కూడా సంపాదించుకున్నాడు. ఒక్కసారి ఆయన ప్రొడ్యూసర్ తో నా బాడీ సపోర్ట్ చేయడం లేదు నేను రాను కావాలంటే షూట్ పోస్ట్ పోన్ చేయండి అని ఒక మాట చెబితే ప్రొడ్యూసర్ కూడా షూట్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ప్రొడ్యూసర్ నష్టాలను చవిచూడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో తను నడవలేని స్థితిలో ఉన్నా కూడా అవుట్ డోర్ షూట్ కి వెళ్లి ఆయన చాలా ఇబ్బందులు పడినప్పటికీ షూటింగ్ ను మాత్రం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు అంటే మామూలు విషయం కాదు.
సినిమా మీద పిచ్చి, విపరీతమైన పాషన్ ఉండి, చివరి శ్వాస వరకు సినిమానే నా ఊపిరి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగే వాళ్ళు మాత్రమే ఇలాంటి కొన్ని డేరింగ్ డీసీజన్స్ ని తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. చిన్న దెబ్బ తగిలితేనే వారం రోజులపాటు రెస్ట్ తీసుకునే ఈ రోజుల్లో కాలికి పెద్ద గాయమైన భరించలేని నొప్పి ఉన్న కూడా తనని నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోకూడదనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం యావత్ సినీ ప్రపంచాన్ని సైతం గర్వపడేలా చేస్తుంది…