Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ప్రవేశించారు. నాగ మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, ప్రేరణ, నిఖిల్, బెజవాడ బేబక్క, పృథ్విరాజ్, అభయ్ నవీన్, నబీల్ అఫ్రిది, యాష్మి గౌడ, విష్ణుప్రియ, సోనియా ఆకుల, శేఖర్ బాషా… సీజన్ 8 కి గాను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ సీజన్ కి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ప్రైజ్ మనీ ఎంత అనేది కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది.
గతంలో విన్నర్ కి రూ. 50 లక్షలు ఇచ్చేవారు. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ని బేస్ చేసుకుంది ప్రైజ్ మనీ యాభై లక్షల కంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇది ఆసక్తికర పరిమాణం. అలాగే గత సీజన్స్ లో ఉన్న కెప్టెన్ కాన్సెప్ట్ స్థానంలో చీఫ్స్ ని తీసుకొచ్చారు. ప్రతివారం ముగ్గురు కంటెస్టెంట్స్ ఛీఫ్ 1, చీఫ్ 2, ఛీఫ్ 3గా నియమింపబడతారు. మొదటి వారానికి గాను నిఖిల్, నైనిక, యాష్మి గౌడ చీఫ్స్ గా ఎన్నికయ్యారు.
రేషన్ అన్ లిమిటెడ్ గా ఎంజాయ్ చేయవచ్చు. ఇది కూడా కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా పొందే వీలు ఉంటుంది. ఇక సోమవారం మొదటి వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్స్ గట్టిగా వాదనకు దిగారు. శేఖర్ బాషా-నాగ మణికంఠ మధ్య వాగ్వాదం నడిచింది. అలాగే ప్రేరణ-సోనియా ఆకుల సైతం తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. బేబక్క, నాగ మణికంఠ, సోనియా ఆకుల, శేఖర్ బాషా, పృథ్విరాజ్, ప్రేరణ నామినేట్ అయినట్లు సమాచారం. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఒక అంచనా ప్రకారం బేబక్క ను ఇంటికి పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సీజన్స్ సెంటిమెంట్స్ పరిశీలించినా బేబక్క ఇంటిని వీడే అవకాశం మెండుగా ఉంది.
ఓట్ల సంగతి అటుంచితే… బెజవాడ బేబక్క వయసులో పెద్దవారు. ఏజ్ బార్ లేడీ కంటెస్టెంట్స్ ని హౌస్లో ఉంచరు. వారిని ఐదు వారాల లోపే ఇంటికి పంపిస్తారు. అలాగే మెజారిటీ సీజన్స్ లో ఇదే జరిగింది. అలాగే లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువగా ఎలిమినేట్ అయ్యారు. సమీకరణాలు అన్నీ పరిశీలిస్తే బెజవాడ బేబక్క బిగ్ బాస్ ఇంటిని వీడటం ఖాయం అంటున్నారు. వచ్చే ఆదివారంతో దీనిపై స్పష్టత వస్తుంది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా స్టార్. ఆమె వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో పాపులారిటీ తెచ్చుకుంది.