Hari Hara Veera Mallu : మామూలుగానే పవన్ ఫ్యాన్స్ అంటే ఏపీలో రచ్చ రంబోలా.. వారి అభిమానికి హద్దు ఉండదు. పైగా రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సినిమాలు తగ్గించేశాడు. దీంతో మొహం వాచి పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత ఎన్నో వాయిదాలు, వ్యయప్రయాసలకోర్చి ‘హరిహర వీరమల్లు’ మూవీని పవన్ విడుదల చేశాడు. అతి కష్టం మీద కంప్లీట్ చేసి ఈ సినిమాను పట్టాలపైకి ఎక్కించాడు. సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. చాలా మంది రివ్యూయర్స్ , క్రిటిక్స్ 2, 2.5 మాత్రమే రేటింగ్ ఇవ్వడంతో ఈ సినిమా యావరేజ్ అన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఫస్టు షోలు అభిమానుల కోసం వేస్తారు. పవన్ ఫ్యాన్స్ ఇందులో చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ముఖ్యంగా థియేటర్స్ లో స్క్రీన్ మీదకు ఎక్కి రచ్చ చేయడం గొడవలు, స్క్రీన్లు పగుల కొట్టడం.. నానా భీభత్సాలు జరుగుతుంటాయి. స్క్రీన్ మీదకు ఎక్కి డ్యాన్సులు చేసి హంగామా చేస్తుంటారు.
దీంతో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ యజమాని ఈ ఫ్యాన్స్ గోల తట్టుకోలేక స్క్రీన్ ముందు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇనుప కంచెలు, ముళ్లతో కూడిన ఫెన్సింగ్ పెట్టారు. దానిపైన మొలలతో కొచ్చిగా మొనదేలిన ముళ్ల స్టాండ్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఎవరైనా స్క్రీన్ మీదకు ఎక్కితే ప్రాణాలే పోతాయి.. ముళ్లు గుచ్చుతాయి.. చావడం ఖాయం..
ఇలా సంధ్య థియేటర్ లో పైన స్క్రీన్ మీద ఇనుప కంచెలు.. కింద సీట్ల కింద సిమెంట్ ఇటుకలు పెట్టేసి సీట్లు నాశనం కాకుండా సంధ్య థియేటర్ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఇలా ఫ్యాన్స్ వెర్రి చేష్టలకు హైదరాబాద్ సంధ్య థియేటర్ యజమాన్యం చేసిన ఈ ఆలోచన.. యజమాన్యం పడుతున్న కష్టాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.