Pawan Kalyan Vs Komatireddy: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కోనసీమ పర్యటన లో తెలంగాణ నాయకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రాజకీయంగా పెను దుమారమే రేపింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ అంశంపై మాట్లాడారు, విమర్శలు చేశారు, కానీ పెద్ద రేంజ్ కి తీసుకెళ్లింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులే. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ పై వరుసగా దాడి చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి(Komatireddy) మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఒక రేంజ్ లో ట్రిగ్గర్ చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలను ఇక మీదట మా తెలంగాణ లో ఆడనివ్వం, వెంటనే ఆయన క్షమాపణలు చెప్తే ఆలోచిస్తాం, ఇది సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నా మాట అంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం పై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రెచ్చిపోయారు.
ఇలాంటి బెదిరంపులకు లొంగేవాళ్ళం కాదు, ఇలాంటివి ఆంధ్ర ప్రదేశ్ లో మా నాయకుడు ఎన్నో చూసి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా లో కూర్చున్నాడు. మా సినిమాని ఆపేంత దమ్ము ఉంటే ప్రయత్నం చెయ్యి, చూసుకుందాం అంటూ కోమటి రెడ్డి ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. అంతే కాదు గతం లో కోమటి రెడ్డి ఆంధ్ర ప్రజల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి నిలదీస్తున్నారు. ఇలా నాన్ స్టాప్ గా పవన్ ఫ్యాన్స్ నుండి దాడి ఎదురు అవ్వడం తో, కోమటి రెడ్డి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్స్ కి సంబంధించిన లింకులను ఆధారాలతో సహా సీసీఎస్ లో ఫిర్యాదు చేశారట.
దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ మాత్రం బెదరడం లేదు, పోలీస్ కేసులతో మమ్మల్ని అడ్డుకోలేరు, మా నాయకుడి జోలికి వస్తే ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం లో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. పైగా తెలంగాణాలో జనసేన పార్టీ క్రియాశీలక పాత్రలో లేదు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యధిక భాగం ఉంటారు. వాళ్ళ ఓట్లను కోల్పోయిన వాళ్ళు అవుతారు. పవన్ కళ్యాణ్ వీడియో లో అంత స్పష్టంగా తెలంగాణా నాయకులు అని అసంబోదించినా కూడా తెలంగాణ ప్రజలను అన్నట్టు రచ్చ చేయడం కాంగ్రెస్ కి బ్యాక్ ఫైర్ అయ్యే అంశమే అని చెప్పొచ్చు.